HomeOTTThe Family Man వెబ్ సిరీస్ విషయంలో దర్శక నిర్మాతల షాకింగ్ నిర్ణయం

The Family Man వెబ్ సిరీస్ విషయంలో దర్శక నిర్మాతల షాకింగ్ నిర్ణయం

The Family Man makers to end the show after this season
The Family Man makers to end the show after this season

The Family Man Last Season:

ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ ఓటిటి లో ఒక సంచలనం సృష్టించిన సిరీస్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌తో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయి కెరీర్‌ తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. అసలు ఆయన చేతిలో ఒక్క సినిమా కూడా లేదు అని అందరూ అనుకుంటున్న సమయంలో ఈ సిరీస్ తర్వాత ఆయనపై ఆఫర్ల వర్షం కురిసింది.

ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సిరీస్‌లో రెండవ సీజన్‌లో సమంత ప్రధాన పాత్ర పోషించారు. ఆమె హిందీ కెరీర్‌ ఈ ప్రాజెక్ట్‌తో పెద్ద మలుపు తిరిగింది. ఇప్పుడు ఈ సిరీస్ మూడవ సీజన్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సీజన్ విడుదల కానుంది.

అయితే, తాజా సమాచారం ప్రకారం, ది ఫ్యామిలీ మాన్ సిరీస్ నాల్గవ సీజన్‌తో పూర్తి కాబోతోంది అని సమాచారం. సిరీస్‌ను ఇంక పెంచకుండా నాల్గవ సీజన్‌తో ముగించాలని మేకర్స్ నిర్ణయించారని తెలుస్తోంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం కథను మరింత సాగదీయకుండా, అభిమానులకు హ్యాపీ ఎండింగ్ ఇవ్వడమే అని తెలుస్తోంది.

ఈ సిరీస్ వెనుక తెలుగులో రాజ్, డీకే అనే దర్శక ద్వయం ఉన్నారు. ది ఫ్యామిలీ మాన్ సిరీస్ ఒక అండర్ కవర్ ఏజెంట్ జీవితం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ మధ్యే మూడవ సీజన్ కి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు వచ్చింది. సిరీస్ విడుదలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu