‘కబీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకుంది కియారా అద్వానీ. ఈ చిత్రంలో షాహిద్ కపూర్‌కు జంటగా నటించింది కియారా. ఈ సినిమా సక్సెస్‌తో ఎన్నో చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. భరత్ అనే నేను చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కియారా ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లో బిజీగా ఉంది. ఉన్నారు. ‘గుడ్ న్యూస్’, ‘లక్ష్మిబాంబ్’, ‘ఇండో కీ జవానీ’, ‘భూల్ భూలాయా2’ చిత్రాలలో నటిస్తోంది. ధోనీ చిత్రంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేశానని అందరూ అనుకుంటారు.. కానీ అంతకంటే ముందు కియారా ‘ఫగ్లీ’ అనే చిత్రంలో నటించిందట. ఆ సినిమా తర్వాత కియారాకు ఆఫర్లు లేక చాలా కష్టాలు పడిందట. ఆ సమయంలో అసలు తనకు మళ్లీ సినిమా అవకాశం వస్తుందా? కెరీర్‌కు ఏమైంది? అని బాగా ఆలోచించేదట. తన జీవితంలో అది చాలా క్లిష్టమైన సమయమని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది కియారా. అలాగే తనకు సినిమాల్లో అవకాశాలు తేలిగ్గా రాలేదని.. ఆడిషన్స్ సమయంలో కూడా ఎంతో కష్టపడ్డానని ఒకప్పుడు నన్ను ఇష్టపడనివారు సైతం ఆఫర్లు ఇస్తున్నారని చెప్పింది.