టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇటీవల మలయాళ సినిమా కప్పెలపై తన వ్యక్తిగత అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇందులో హీరో అరవడాలు లేవు, మాస్ అప్పీల్ లేదు. అనవసరపు సన్నివేశాలు లేవు అంటూ పెద్ద పోస్ట్ పెట్టాడు. అయితే టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలోని సన్నివేశాలను పోలి ఉన్నాయని భావించిన సదరు హీరో అభిమానులు తరుణ్ ని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు.
దీంతో తరుణ్ భాస్కర్ ఈరోజు తనను ట్రోల్ చేసిన ఇద్దరిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను వ్యక్తిగతంగా దూషించారని ఇద్దరి పేర్లు వారి ఫోన్ నెంబర్లను కూడా అందజేశాడు. ‘ఫోన్ నెంబర్లు తీసుకొని వారితో మాట్లాడినా వారు బెదిరింపు స్వరంతోనే మాట్లాడారు. ఆ ఫోన్ కాల్స్ కూడా పోలీసులకు ఇచ్చాం” అని పేర్కొన్నాడు తరుణ్ భాస్కర్. దీనికి సంభందించిన వివరాలు.. పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. నువ్వు తెలుగు సినిమాల గురించి తప్పుగా మాట్లాడితే లేదు గానీ… ఎవరైనా కౌంటర్ ఇస్తే వాళ్ళని సోషల్ మీడియా ఫ్రాడ్ లో కేసు పెట్టడం.. సూపర్ అంటూ.. తరుణ్ భాస్కర్ని నెటిజన్స్ విమర్శిస్తున్నారు. మరి ఇది ఎంత దూరం పోతుందో చూడాలి.