‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు తరుణ్ భాస్కర్ రీసెంట్ గా అలీతో సరదాగా పోగ్రామ్ లో పాల్గొన్నారు. ఆ సరదా ఇంటర్వూలో భాగంగా గతంలో జరిగిన ఓ సీరియస్ యాక్సిడెంట్ గురించి వివరించారు. ‘పెళ్లి చూపులు’ సినిమా సమయంలో ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అయిన సంఘటనను గుర్తుచేసుకున్నారు.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. “ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అవ్వగానే అప్పటివరకు భయపడ్డ విజయ్ సడన్‌గా రిలాక్స్ అయిపోయాడు. ప్రియదర్శి హ్యాండ్ బ్రేక్ తీయగానే అది చేతులోకి వచ్చేసింది. తర్వాత ట్రక్కు వెళ్లి చెట్టును ఢీ కొట్టింది. అందరం బతికిపోయాం. అయితే నేను బతికి ఉన్నానన్న దానికంటే విజయ్ ఎందుకలా కూల్‌గా ఉన్నాడో తెలుసుకోవాలన్న ఆతృత ఉందప్పుడు. వెంటనే విజయ్ దగ్గరకు వెళ్లి ఎందుకంత రిలాక్స్‌గా ఉన్నావని అడిగితే.. ‘మొదట భయమేసింది, కానీ తర్వాత అందరం చచ్చిపోతాం కదా, ఏముంది’ అని సమాధానం చెప్పడంతో షాకయ్యా” అని అన్నారు తరుణ్ భాస్కర్.