అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. ఇటీవలే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. జూలై 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో చైతూ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. చైతూ సరసన నాయికలుగా రాశి ఖన్నా .. మాళవిక నాయర్ .. అవికా గోర్ అలరించనున్నారు.
ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. త్వరలోనే అలా ఈ సినిమా నుంచి టీజర్లు.. ట్రైలర్లు .. లిరికల్ వీడియోల సందడి మొదలు కానుంది. ముగ్గురు హీరోలతో చైతూ రొమాన్స్ అనడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. చైతూ ఆ తరువాత ప్రాజెక్టును పరశురామ్ తో చేయనున్నాడనే సంగతి తెలిసిందే.
The date is set!
Get ready to experience the magic of @chay_akkineni’s, #ThankYouTheMovie on July 8th, 2022 in theaters❤️@Vikram_K_Kumar@RaashiiKhanna_@MusicThaman @pcsreeram @BvsRavi #MalavikaNair @avika_n_joy @SaiSushanthR @SVC_official @adityamusic#ThankYouOnJuly8th pic.twitter.com/9YE52vleFZ
— Sri Venkateswara Creations (@SVC_official) May 14, 2022