HomeTelugu TrendingThandel: షూటింగ్ సంగతి సరే.. మరి విడుదల తేదీ?

Thandel: షూటింగ్ సంగతి సరే.. మరి విడుదల తేదీ?

Thandel
Naga Chaitanya Thandel to wrap up the shooting

Thandel Release Date: ఈ మధ్యకాలంలో నాగచైతన్య టైం ఏ మాత్రం బాగోవడం లేదు. చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతోంది. కస్టడీ లాంటి కొత్తదనం ఉన్న సినిమాలు ట్రై చేసినా కూడా.. అవి బెడిసి కొడుతున్నాయి. ఇటువంటి సమయంలో నాగచైతన్య మరొక ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.

అదే తండేల్. లవ్ స్టోరీ సినిమా తర్వాత మరొకసారి నాగచైతన్య సరసన.. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. మత్స్యకారుల బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ సినిమాలో నాగచైతన్య కూడా ఒక మత్స్యకారుడిలా కనిపించబోతున్నాడు.

ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ కూడా మరి కొద్ది రోజుల్లో పూర్తి కాబోతోంది. మొన్ననే విశాఖపట్టణంలో సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగా.. నాగచైతన్య వెంటనే చెన్నైకి వెళ్ళిపోయారు.

ఇక త్వరలోనే హైదరాబాద్, ఢిల్లీలలో కూడా రెండు షూటింగ్ షెడ్యూల్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇంకా ఒక రెండు పాటలు, ఒక ఫైటింగ్ సన్నివేశం షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అవి పూర్తి అయిపోతే షూటింగ్ మొత్తం పూర్తయిపోయినట్లే. మరోవైపు సినిమాకి సంగీతాన్ని చేకూరుస్తున్న దేవిశ్రీప్రసాద్.. ఇప్పటికే సినిమాకి ట్యూన్స్ అందించేశారు.

నిర్మానంతర పనులు కూడా అయిపోతే సినిమాని డిసెంబర్ 20 కి హ్యాపీగా విడుదల చేయొచ్చు. కానీ అక్కడే అసలైన చిక్కు వచ్చి పడింది. ఆల్రెడీ పుష్ప 2 సినిమా డిసెంబర్ 6న విడుదల కి సిద్ధం అవుతుంది. అయినా సరే ధైర్యం చేసి ఈ సినిమాని విడుదల చేద్దాం అనుకుంటే.. రామ్ చరణ్ గేమ్ చేంజర్ డిసెంబర్ 20వ తేదీకి విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక చిత్ర బృందం త్వరలోనే సినిమా విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. సినిమా విడుదల చేయడమా లేక వాయిదా వేయడమా లేక ముందుకు జరపడమా అని చిత్ర బృందం ఏదో ఒకటి ఫిక్స్ అవ్వాలి. మరి సినిమా దర్శక నిర్మాతలు విడుదల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu