టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘తమ్ముడు’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ షూటింగ్ లో ప్రమాదం జరిగిందని, నితిన్ గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మూవీ టీమ్ ఆ వార్తలను యూనిట్ ఖండించింది.
షూటింగ్ లో ఎలాంటి ప్రమాదం జరగలేదని క్లారిటీ ఇచ్చింది. హీరో నితిన్ భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్నాడని, అందుకే షూటింగ్ కు బ్రేక్ ఇచ్చామని తెలిపింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
యాక్షన్ సన్నివేశాల కోసం ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అడవుల్లో మకాం వేసిన ఈ చిత్ర బృందం.. హీరో అనారోగ్యం కారణంగా ప్రస్తుతం షూటింగ్ నిలిపివేసింది. నితిన్ ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని సినిమా యూనిట్ వర్గాలు తెలిపాయి.