పవన్ కళ్యాణ్ అత్తారింటిది దారేది సినిమా తరువాత మరొకటి చేయలేదు. 2019లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే, అనుకోకుండా ఈ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైంది. పార్టీ ఓటమిపాలైనా… పవన్ ఎక్కడా నిరాశ చెందలేదు. ఎందుకంటే, ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా డబ్బులు పంచకుండా పోటీకి దిగిన పవన్, రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 5శాతం ఓటు బ్యాంకును సొంతం చేసుకున్నారు.
రాజకీయాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పోరాటం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, పవన్ కళ్యాణ్ మరలా సినిమా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించలేదు. దర్శక నిర్మాతలు మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నట్టు చెప్తున్నారు. బాలీవుడ్ లో మంచి హిట్ అందుకున్న పింక్ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ పాత్రను పవన్ పోషిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆ కార్యక్రమానికి పవన్ హాజరుకాలేదు. అయినా, ఇందులో పవన్ నటిస్తున్నారని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా థమన్ తనదైన శైలిలో మ్యూజిక్ అందిస్తూ బంపర్ హిట్స్ అందుకుంటున్నాడు. తొలిప్రేమ సినిమాతో రోటీన్ కు భిన్నంగా మ్యూజిక్ అందించిన థమన్ అప్పటి నుంచి తిరుగులేకుండా దూసుకుపోతున్నారు.