Raja Saab Update :
సలార్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. కల్కి 2898 AD సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ అందుకున్నారు. విడుదలై వారాలు గడిచినా కూడా ఈ సినిమా ఇంకా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలానే ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి.
అందులో రాజా సాబ్ సినిమా కూడా ఒకటి. ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు పెట్టింది పేరు అయిన మారుతి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కల్కి సినిమా తర్వాత ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అభిమానులలో కొందరు కంగారు కూడా పడుతున్నారు. ఈ విషయాన్ని ఈ పక్కన పెడితే తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజాగా జరిగిన జామ్ జంక్షన్ అనే ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తమన్ సినిమా గురించి చెప్పారు. ముందుగా గేమ్ చేంజర్ సినిమా గురించి అడగగా సినిమాలో మొత్తం ఏడు పాటలు ఉన్నాయని అందులో రెండవ పాట ఎప్పుడైనా విడుదల కావచ్చు అని అన్నారు. అయితే ఆగస్టు నుంచి మాత్రం సినిమాకి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయని తమన్ చెప్పడంతో మెగా ఫాన్స్ హ్యాపీ అయ్యారు.
దీంతో వెంటనే అక్కడ ఉన్న ఒక రిపోర్టర్.. ప్రభాస్ రాజా సాబ్ సినిమా గురించి కూడా అప్డేట్ ఇవ్వమని కోరారు. “మేము కూడా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాము. మా ప్రాబ్లమ్స్ మాకు ఉన్నాయి. కల్కితో ఆయన హిట్టు కొట్టిన తర్వాత.. చాలా రోజుల తర్వాత ఆయన కమర్షియల్ ఆల్బమ్ తో వస్తున్నారు. నాక్కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను కూడా వెయిట్ చేస్తున్నాను” అని అన్నారు తమన్.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గేమ్ చేంజర్ సినిమా సంగతి పక్కన పెడితే.. రాజా సాబ్ సినిమా అప్డేట్ గురించి.. తమన్ మాట్లాడిన మాటలు అభిమానులలో మరింత కంగారు తెచ్చిపెట్టాయి. ఇది కమర్షియల్ సినిమా అని అందరికీ తెలుసు. పైగా మారుతి కెరియర్ గ్రాఫ్ విషయంలో కూడా ఫాన్స్ కొంచెం నిరాశ చెందుతున్నారు. ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుతూ తమన్ ఫ్రస్టేషన్ అని, వాళ్ల ప్రాబ్లమ్స్ వాళ్లకి ఉన్నాయి అంటూ కామెంట్లు చేయడం ఫాన్స్ ని మరింత కంగారు పెడుతోంది.