HomeTelugu Trending'కళావతి' పాటకు తమన్‌ డ్యాన్స్‌.. వైరల్‌

‘కళావతి’ పాటకు తమన్‌ డ్యాన్స్‌.. వైరల్‌

Thaman Trolled For His Work In Bheemla Nayak Trailer?

మ్యూజిక్​ డైరెక్టర్‌​ తమన్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం తమన్​ సంగీతం అందించిన మరో సినిమా ‘సర్కారు వారి పాట’. సూపర్​ స్టార్​ మహేశ్​ బాబు, కీర్తి సురేష్​ జోడిగా పరశురామ్​ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్​ లిరికల్​ ‘కళావతి సాంగ్’​ యూట్యూబ్​లో ట్రెండింగ్​లో దూసుకుపోతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజైన ఈ లిరికల్​ అత్యధిక వ్యూస్​తో దుమ్ములేపుతోంది. దీంతో నెటిజన్లే కాకుండా కీర్తి సురేష్​, మహేశ్​ బాబు కుమార్తె సితార సైతం ఈ సాంగ్​పై స్టెప్పులేసి అలరించారు.

తాజాగా తనే కంపోజ్​ చేసిన సాంగ్​కు స్టెప్పులేసి అబ్బురపరిచాడు తమన్​. శేఖర్​ మాస్టర్​తో కలిసి తనదైన స్టైల్​లో డ్యాన్స్ చేశాడు. ఈ పాటలో మహేశ్ బాబు వేసిన హుక్​ స్టెప్​ను వేసిన తమన్​ సోషల్​ మీడియాలో షేర్​ చేశాడు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. తమన్​ డ్యాన్స్​ స్టెప్పులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu