HomeTelugu Trending'వకీల్‌ సాబ్' సినిమాతో నా బాధ్యత పెరిగింది: తమన్‌

‘వకీల్‌ సాబ్’ సినిమాతో నా బాధ్యత పెరిగింది: తమన్‌

8 5ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ ‘వకీల్‌ సాబ్‌’.. సినిమా విషయంలో తన బాధ్యత ఎంతగానో పెరిగిందని అన్నారు. ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత దాదాపు రెండేళ్లు విరామం తీసుకున్న అనంతరం పవన్‌ వెండితెరపై సందడి చేయనున్న చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. హిందీలో మంచి విజయం సాధించిన ‘పింక్‌’ చిత్రానికి రీమేక్‌గా ‘వకీల్‌ సాబ్‌’ రూపొందుతుంది. వేసవి కానుకగా మే 11న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్‌ కారణంగా కొంతకాలంపాటు వాయిదా పడింది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర సంగీత దర్శకుడు తమన్‌తో ఓ ఛానెల్‌ వారు ప్రత్యేకంగా ముచ్చటించారు. ఇందులో భాగంగా ‘వకీల్ సాబ్‌’ సినిమా గురించి ఆయన స్పందించారు.

‘మార్చి 16న ‘వకీల్‌ సాబ్‌’ కంపోజింగ్‌ పూర్తి చేసుకుని మార్చి 17 తేదీన చెన్నైకి వచ్చాను. రాజకీయాలపై దృష్టి సారించి దాదాపు రెండేళ్లపాటు సినిమాల నుంచి గ్యాప్‌ తీసుకుని పవన్‌కల్యాణ్‌ వెండితెరపై సందడి చేయనున్న ‘వకీల్‌ సాబ్‌’ సినిమా విషయంలో సినీ ప్రియుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆయనకు ఉన్న క్రేజ్ దృష్ట్యా, సినిమా కథపరంగా.. సంగీతం విషయంలో నాకెంతో బాధ్యత పెరిగింది. ఒక అభిమానిగా నేను ఆయనతో కలిసి పనిచేస్తున్న మొదటి సినిమా ఇది. ఆయన క్రేజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా సంగీతం, పాటలు అందించాలనుకున్నాను. అలాగే ఏ పాట విడుదల చేసినా సరే అదొక మార్క్‌ క్రియేట్‌ చేయాలనుకున్నాను. మేము ఆశించినట్టుగానే ఇటీవల విడుదల చేసిన మొదటి పాట ‘మగువా మగువా’ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. రామజోగయ్య శాస్త్రిగారు మంచి సాహిత్యాన్ని అందించారు. మా దర్శక నిర్మాతలు నాకెంతో సపోర్ట్‌ చేశారు.’ అని తమన్‌ వివరించారు.

అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ కీలక పాత్రల్లో బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం ‘పింక్‌’. 2016లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా తమిళంలో కూడా రీమేక్‌ చేశారు. అజిత్‌ ప్రధాన పాత్రలో తమిళ రీమేక్‌ తెరకెక్కింది. అయితే ‘పింక్‌’ తెలుగు రీమేక్‌కు వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu