ఒకప్పటి హీరోయిన్స్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ రోల్స్
చేస్తున్నారు. శ్రియ వంటి తారలు తల్లి పాత్రల్లో కూడా కనిపించి మెప్పించారు. టాలీవుడ్ అయినా,
కోలీవుడ్ అయినా.. బాలీవుడ్ అయినా.. ఇదే తంతు. అయితే ఇప్పుడు మరో తార తల్లి
పాత్రల్లో కనిపించడానికి సిద్ధం అంటోంది. హిందీ సినిమాలతో పాటు తెలుగులో కూడా కొన్ని
చిత్రాల్లో నటించిన శిల్పా శెట్టి ఆ తరువాత వివాహం చేసుకొని సినిమాలకు దూరమయ్యింది.
భర్తకు వ్యాపార విషయాల్లో సహాయం చేస్తూ.. సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.
అయితే ఇప్పుడు మరోసారి సినిమాల్లోకి రావాలనుకుంటోంది. ఎలాగో హీరోయిన్ రోల్స్
రావు కాబట్టి తల్లి పాత్రల్లో నటించడానికి సిద్ధపడుతోంది. ఏ భాషలో అయినా నటించడానికి
రెడీగా ఉన్నానంటోంది. మరి ఈ స్టయిలిష్ మమ్మీకు అవకాశాలు ఎవరు ఇస్తారో చూడాలి!!