HomeTelugu Big StoriesThalapathy 69: రీమేక్ సినిమాతో 1000 కోట్లు సాధ్యమేనా?

Thalapathy 69: రీమేక్ సినిమాతో 1000 కోట్లు సాధ్యమేనా?

Thalapathy 69: 1000 crores dream or reality?
Thalapathy 69: 1000 crores dream or reality?

Thalapathy 69 Latest Update:

తమిళ స్టార్ తలపతి విజయ్ తన రాజకీయ ప్రయాణం ప్రారంభించేముందు నటించనున్న చివరి చిత్రం తలపతి 69 గురించి భారీ అంచనాలు ఉన్నాయి. హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ వేగంగా సాగుతోంది. డిసెంబర్ 31న ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ చేయనున్నట్టు సమాచారం.

ఇప్పటికే ఈ చిత్రంపై తమిళ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి రీమేక్ అని కొన్ని పెద్ద సోషల్ మీడియా పేజీలు వెల్లడించడంతో ఈ అంచనాలు కొంతమేర తగ్గాయి. భగవంత్ కేసరి తెలుగు ప్రేక్షకులకు కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఇలాంటి కథాంశాన్ని విజయ్ తన చివరి సినిమాగా ఎంచుకోవడం అభిమానులను నిరాశలోకి నెట్టింది.

తమిళ ప్రేక్షకుల నిరాశ
తలపతి విజయ్ అభిమానులు ఈ చిత్రానికి 1000 కోట్ల కలెక్షన్ సాధించే సత్తా ఉందని భావిస్తున్నారు. పుష్ప 2 విజయం తర్వాత, తమిళ సినీ పరిశ్రమ కూడా ఇటువంటి భారీ కలెక్షన్ చిత్రాలపై ఆశలు పెట్టుకుంది. కానీ ఈ సినిమా రీమేక్‌గా వస్తుండటం, విజయ్ సినిమాకు ప్రతిష్టను తగ్గించవచ్చని ట్రోలింగ్‌కు దారితీస్తోంది.

విజయ్ తన చివరి చిత్రంగా భగవంత్ కేసరి వంటి సాధారణ కథతో సినిమా చేయడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఇలాంటి రీమేక్ సినిమా కాకుండా, ఓ పవర్‌ఫుల్ కథతో, విజయ్ తన కెరీర్‌ను ముగిస్తే అది నిజమైన వీడ్కోలుగా నిలుస్తుందని అభిమానులు కోరుకుంటున్నారు.

ALSO READ: Prabhas డబుల్ డ్యూటీ: Fauji, Raja Saab సినిమాలకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్స్..!

Recent Articles English

Gallery

Recent Articles Telugu