AP Elections: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసి 10 రోజులు గడిచిపోయింది. జూన్ 4న వచ్చే ఫలితాలపై రాజకీయ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే. ఈలోపు రాజకీయ పార్టీ నేతలను టెన్షన్ వెంటాడుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసి 10 రోజులు గడిచిపోయింది. జూన్ 4న వచ్చే ఫలితాలపై రాజకీయ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే. ఈలోపు రాజకీయ పార్టీ నేతలను టెన్షన్ వెంటాడుతోంది. ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ పైకి గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోపల ఉండే భయం ఉండనే ఉందట. ఏమో చివరికి ఫలితం ఎలా ఉంటుందోననే ఉత్కంఠ ఇరు పార్టీల నేతల్లోనూ ఉందని అంటున్నారు.
ఇరు పార్టీలు 100కి పైగా స్థానాలు గెలుస్తామని పైకి ధీమా వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఓటమి భయం అధికార పార్టీలో కొంచెం ఎక్కువుగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి ప్రజలు తమకే ఓట్లు వేశారని ఓవైపు వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంత వరకు ప్రభావం చూపిస్తుందనేదానిపైనే ఫలితం ఆధారపడనుంది. ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో ఉన్న ఏపీ వాసులు ఉప్పెనలా తరలిరావడం ప్రభుత్వంపై వ్యతిరేకతను చూపిస్తోందని, వారంతా కూడా ఎన్డీఏ కూటమికే ఓటు వేశారని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు అనుకుంటున్నారు.
ప్రభుత్వ అనుకూల ఓటు కంటే.. వ్యతిరేక ఓటింగ్ ఎక్కువగా జరిగిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారట. ఈసారి ఎన్నికల్లో ఎగువ, దిగువ మధ్య తరగతి మహిళలు ఉదయం 6 గంటల నుంచే ఓటు వేసేందుకు క్యూలోకి వచ్చి నిల్చున్నారంటే ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఇదే నిదర్శనమని ఎన్డీఏ కూటమి నేతలు అంటుంటే.. అదే ప్రభుత్వ పథకాలు చూసి మరోసారి వైసీపీని గెలిపించాలని మహిళలు తరలివచ్చి ఓటు వేశారని వైసీపీ నేతలు అంటున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100కి పైగా సీట్లు గెలుస్తామని ఎన్డీయే కూటమి, మరోవైపు వైసీపీ నేతలు అనుకుంటున్నారు. వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని అంటున్నారు. గత ఐదేళ్లుగా వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఏపీ ప్రజలు మార్పు కోరుకున్నారని.. దానికి అనుగుణంగానే ఓటింగ్ జరిగిందనే చర్చకూడా నడుస్తోంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వానికి మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఓటింగ్ శాతం పెరిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఓటింగ్ సరళి చూసిన తర్వాత విజయం తమదేనని ఎన్డీయే నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతోనే ప్రజలు భారీగా ఓటింగ్‌లో పాల్గొన్నారని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు చెబుతున్నారు. గెలుపుపై మాత్రం ఎన్డీయే కూటమి, వైసీపీ ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఓట్లు ఎవరికి పడ్డాయనేదానిపై ప్రస్తుతం జరుగుతోంది. ఓవైపు మధ్యతరగతి మహిళలు, వృద్ధులు వైసీపీకి అనుకూలంగా ఓటు వేశారనే ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో కొంతమంది చదువుకున్న మహిళలు మాత్రం కూటమి వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
వృద్ధుల ఓట్లు కూటమికి, వైసీపీకి చీలిపోయాయని.. ఈక్రమంలో విజేతను నిర్ణయించేది యువత ఓట్లు మాత్రమేననే చర్చ నడుస్తోంది. యువత ఎన్డీయే కూటమి అభ్యర్థులకే మద్దతుగా నిలిచారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు చెబుతున్నారు. జగన్ అరాచకపాలనకు అంతం పలకాలనే ఉద్దేశంతో యువత అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారనే ప్రచారం ఉంది. యువత ఓట్లు ఎవరికి పడ్డాయో మరి కొద్దిరోజుల్లోనే తేలనుంది.