తెలుగులో హీరోయిన్స్ తక్కువ ఉండడం వలనో.. లేక మార్కెట్ దృష్ట్యా తెలియదు కానీ
తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ కంటే మలయాళ హీరోయిన్స్ హవా పెరిగిపోయింది.
కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ వంటి హీరోయిన్స్ ఇప్పటికే తమ సత్తాను చాటారు.
సాయి పల్లవి కూడా త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ నేపధ్యంలో మరో మలయాళ బ్యూటీ
మియాజార్జ్ కూడా ఎంటర్ అవ్వబోతుంది. మలయాళంలో, తమిళంలో పలు చిత్రాలలో
నటించి నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకున్న మియాజార్జ్ ను దర్శకుడు
క్రాంతి మాధవ్ తన సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేశారు. సునీల్ హీరోగా చేస్తోన్న
ఈ సినిమా హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. మరి ఈ చిత్రంతో మియా తెలుగులో
ఎలాంటి ఫేమ్ ను సంపాదిస్తుందో చూడాలి!