యాత్‌ని ఆకట్టుకోవడానికి ఈ మధ్య తెలుగు సినిమాల్లో సైతం బోల్డ్ కంటెంట్ ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఇలాంటి చిత్రలతో యూత్ చెడిపోతుందని పలువురి నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ మన దర్శక నిర్మాతలు అవేమీ పట్టించుకోరు. సినిమా కేవలం అంటే ఎంటర్‌టైన్‌మెంట్ అనే రీతిలో ఫుల్ ఎంటర్‌టైన్ చేసేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటిది సినిమాల వరకే పరిమితమైనా ఇప్పుడు వెబ్ సిరీస్ రూపంలో బుల్లి తెరలోనూ ప్రత్యక్షం కాబోతుంది.
రొమాంటిక్ వెబ్ సిరీస్‌లు తెలుగులో కంటే హిందీలో ఎక్కువగా వస్తున్నాయి. హిందీలో ఆల్ట్ బాలాజీ, ఉల్లు వంటి సంస్థలు సంవత్సరానికి నాలుగైదు వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్నారు. ఇప్పుడు తెలుగు నిర్మాతలు వెబ్ సిరీస్ నిర్మాణం వైపు గురిపెడుతున్నారు. ప్రేక్షకుడిని తనవైపు తిప్పుకోవడానికి కొత్త రూట్లు వెతుకుతున్నారు. ఈ కోవలోనే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముందున్నట్లు తెలుస్తోంది. ఆయన ఒక అడల్ట్ కంటెంట్‌తో వెబ్‌సిరీస్‌కు ప్లాన్ చేశాడు. అల్లు అరవింద్ సొంత ఓటిటి ఆహా యాప్‌లో సిన్ పేరుతో ఈ వెబ్ సిరీస్ వస్తుంది.