HomeOTTBlink on OTT: దసరా నటుడి అదిరిపోయే థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో

Blink on OTT: దసరా నటుడి అదిరిపోయే థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో

Telugu version of Dheekshith Shetty Blink on OTT
Telugu version of Dheekshith Shetty Blink on OTT

Blink on OTT:

కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, తెలుగు సినీ పరిశ్రమలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటున్నారు. ముగ్గురు మోనగాళ్లు, ది రోజ్ విల్లా, ఈమధ్యనే వచ్చిన దసరా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దసరా లో నాని పక్కన రెండవ హీరోగా కీలక పాత్రలో నటించిన దీక్షిత్ మంచి విజయాన్ని అందుకున్నాడు. తన కన్నడ సినిమాలతో కూడా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించే ప్రయత్నం చేస్తున్నారు దీక్షిత్.

ఈ నేపథ్యంలో కన్నడ బ్లింక్ సినిమాను ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ సినిమా మార్చి మొదట్లో థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత ఓటిటి లోకి ప్రవేశించింది. ఆగస్ట్ 12 నుండి బ్లింక్ తెలుగులో ఆమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.

శ్రీనిధి బెంగుళూరు దర్శకత్వంలో రూపొందిన బ్లింక్ లో దీక్షిత్ అపూర్వ పాత్రలో కనిపిస్తారు. తన చదువు కోసం అష్టకష్టాలు పడుతూ, తన భవిష్యత్‌ కోసం పలు రకాల పనులు చేసుకునే యువకుడు అపూర్వ. బెంగళూరులో కుటుంబానికి దూరంగా ఉంటూ తన గర్ల్ ఫ్రెండ్ సహాయంతో బతుకుతూ ఉంటాడు. ఒకేరోజు ఒక వృద్ధుడిని కలిసిన అపూర్వ తన తండ్రి గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు. అపూర్వ తన తండ్రి గురించి నమ్మలేని నిజాలు ఏమి తెలుసుకుంటాడు? తెలియాలంటే సినిమా చూడాలి.

గోపాలకృష్ణ దేశ్‌పాండే, వజ్రధీర్ జైన్, చైత్ర జా ఆచార్, సురేష్ అనగళ్ళి, మందార బట్టలహళ్ళి వంటి వారు ఇందులో నటించారు. దర్శకుడు శ్రీనిధి, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, మరియు ఓడిపస్ కాంప్లెక్స్ వంటి అంశాలను కలిపి చాలా బాగా చూపించారు.

దీక్షిత్ Blink తరువాత కన్నడలో శీఘ్రమేవ కళ్యాణ ప్రతిప్రస్తుతు, స్ట్రాబెర్రీ, బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి వంటి సినిమాల్లో నటించనున్నారు. తెలుగు లో కూడా రష్మిక నటిస్తున్న ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాలో నటించనున్నారు. ఇక ఒప్పీస్ అనే సినిమాతో మలయాళం లో కూడా అడుగుపెట్టబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu