కరోనా మహమ్మారి బుల్లితెర నటులపై పంజా విసురుతుంది. దీని బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిపోతుంది. ఇప్పటికే ప్రభాకర్, హరికృష్ణ, నవ్య స్వామిలకు కరోనా సోకింది. తాజాగా మరో నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ దీని బారిన పడ్డాడు. తెలుగులో అనేక సీరియల్స్ లో నటించిన రవి కృష్ణకు కరోనా సోకిందని తెలుస్తోంది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న రవి కృష్ణ వైద్య పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా వచ్చినట్లు నిర్థారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన వైద్యులు రవి కృష్ణను క్వారెంటైన్‌కు పంపించారు. ప్రస్తుతం రవి కృష్ణ కరోనా చికిత్స తీసుకుంటున్నాడు. ఇక రవికృష్ణతో గత కొన్ని ఆయనతో సన్నిహితంగా ఉన్నవారు తీవ్ర అందోళనకు గురవుతున్నారు. వారందరూ పరీక్షలు చేయించుకుంటున్నారు.