Telugu Theatrical Releases: పెద్ద హీరోల సినిమాలు లేక ఈ సమ్మర్ అంత చాలా డల్‌గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విపరీతమైన ఉష్ణోగ్రతలు, ఐపిఎల్ మ్యాచ్ మరియు ఎన్నికల సో.. అందుకే ఈ సమ్మర్‌కు పెద్ద సినిమాల హాడవిడి లేదు. అయితే పలు చిన్న సినిమాలు నిన్న శుక్రవారం విడుదల అయ్యాయి. ఈ సినిమాలు కూడా ప్రేక్షకులకు నిరాశ మిగిల్చాయి అని చెప్పాలి.
అందులో.. అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు, వరలక్ష్మి శరత్‌కుమార్ శబరి, సుహాస్ ప్రసన్న వదనం నేరుగా తెలుగు సినిమాలు అయితే, తమిళ హారర్ డ్రామా ఆరణ్మనై 4కి తెలుగు డబ్బింగ్ వెర్షన్ అయిన తమన్నా-రాశీ ఖన్నాల బాక్ మాత్రమే ఇతర భాషా చిత్రాలలో ప్రముఖంగా నిలిచింది. అయితే ఈ సినిమాలు అన్నీ కూడా నెగిటీవ్ టాక్ తెచ్చుకున్నాయి.
అల్లరి నరేష్ హీరోగా నటించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ‘చిలక ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి .. స్టార్ రైటర్ అబ్బూరి రవి డైలాగ్స్ అందించడం జరిగింది. టీజర్, ట్రైలర్..బాగానే అనిపించాయి కానీ నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి షోతోనే నెగిటివ్ టాక్ వచ్చింది.
ఈ సినిమాకి రూ.4.13 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.0.57 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.3.83 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ప్రసన్నవదనం’. ఈ సినిమా పై మంచి బజ్ ఉంది. సుకుమార్ శిష్యుడు అర్జున్ వై కె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జె ఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ , రాశి సింగ్ హీరోయిన్స్. మే 3న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఈ సినిమాకి రూ.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.25 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.0.55 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.3.7 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజుతో పోలిస్తే పాజిటివ్ టాక్ ఎఫెక్ట్ వల్ల కాబోలు.. రెండో రోజు బుకింగ్స్ బాగున్నాయి. మరి గ్రోత్ చూపించి బ్రేక్ ఈవెన్ సాధిస్తుందో లేదో చూడాలి.
హర్రర్ కామెడీ నేపధ్యంలో తెరకెక్కిన బాక్ మూవీ పర్వాలేదు అనిపించే రేంజ్ లో టాక్ ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ పరంగా మాత్రం తెలుగు లో పెద్దగా జోరుని చూపించ లేక పోయింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మాస్ సెంటర్స్ లో కొంచం పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసి 36-40 లక్షల లోపు గ్రాస్ ను సినిమా సొంతం చేసుకోగా షేర్ 20 లక్షల లోపు ఉంటుంది
తెలుగు లో సినిమా 2.5 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక తమిళ్ లో సినిమా మొదటి రోజు 4 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 5.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకున్నట్లు సమాచారం.