Telugu Star Heroes Flop Movies: మూవీ ఇండస్ట్రీలో సపోర్ట్ లేకుండా వచ్చిన చిన్న హీరో సినిమాలే ఫ్లాప్ అవుతూ ఉంటాయి అని అనుకుంటారు. కానీ అది తప్పు.. ఎందుకంటే కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీలో ఫ్లాప్ అయ్యాయి. ఆశ్చర్యం ఏంటంటే వంద రోజులు ఆడిన సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడం ఫ్యాన్స్ కి మర్చిపోలేని విషయం అనే చెప్పాలి. ఆ లిస్టులో మన తెలుగు స్టార్ హీరోలు కూడా ఉండడం గమనార్హం.
అంజి: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘అంజి’. ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే బిగ్ డిజాస్టర్ మూవీగా నిలిచింది. అద్భుతమైన గ్రాఫిక్స్ తో కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా భారీ పరాభావాన్ని ఎదుర్కొంది . కోడి రామకృష్ణ దర్శకత్వంలో.. 2004 జనవరి 15వ తేదీ విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ కొన్ని సెంటర్లలో వంద రోజులు ఆడింది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో.. మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ హీరోయిన్‌గా, నాగబాబు కీలక పాత్రల్లో నటించడం విశేషం.
ఖలేజా: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించి చిత్రం ఖలేజా. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ మరియు ఫుల్ లెంత్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా పై ప్రజలు ఓ రేంజ్ లో ఆశలు పెట్టుకున్నారు. అయితే భారీ అంచనల మథ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు నిరాశే మిగిల్చింది. అసలు ఈ సినిమాలో కథ ఏముంది..? అనేది అభిమానులకు కూడా అర్థం కాలేదు. మరీ ముఖ్యంగా మహేష్ బాబుని దేవుడిని చేసి చూపించడం మైనస్‌గా మారింది. ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమా కూడా కొన్ని సెంటర్లలో వంద రోజులు ఆడింది. ఈ సినిమాలో అనుష్క హీరోయిన్‌గా నటించింది.
మున్న: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా మున్న. ఈ మూవీ ప్రభాస్ కెరియర్ లోనే ఫుల్ టు ఫుల్ రివేంజ్ కమర్షియల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. 2007 మే 2వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా పరమ చెత్త టాక్ దక్కించుకుంది . ఈ సినిమాల్లో ప్రభాస్ లుక్స్ కి మంచి క్రేజ్ ఏర్పడిన ..పాటలు హిట్ అయిన కథ మాత్రం జనాలను ఆకట్టుకోలేకపోయింది . ఈ సినిమా 9 కేంద్రాలలో 100 డేస్ ఆడడం అప్పట్లో సంచలనంగా మారింది . కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఆకట్టుకోలేకపోయింది.
స్పైడర్: మహేష్ బాబు హీరోగా కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం స్పైడర్. 2017 సెప్టెంబర్ 27వ తేదీన విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ గా మారింది. కానీ నెల్లూరులోని రామరాజు థియేటర్లో మాత్రం ఏకంగా వంద రోజులు పైనే ఆడింది. ఈ సినిమా గురించి ఫాన్స్ ఓ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేశారు. మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన ట్వీస్ట్ లు లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది . ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఇలా వీటిలో చూస్తే మహేష్ బాబు నటించిన స్పైడర్, ఖలేజా రెండు సినిమాలతో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.