Telugu Producers about Politics: రాజకీయాల గురించి కాస్త కూస్తో తెలిసిన వాళ్ళకి కూడా దాని గురించి, పార్టీల గురించి ఏదో ఒక అభిప్రాయం ఉంటూనే ఉంటుంది. సినీ సెలెబ్రిటీలకి కూడా రాజకీయపరంగా అభిప్రాయాలు ఉంటాయి. కానీ వాళ్లు చాలా వరకు బయటపడరు. ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే మిగతా పార్టీ వారు తమ సినిమాలు చూడటం ఆపేస్తారేమో అన్న భయంతో అయినా రాజకీయాల జోలికి వెళ్లరు.
మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినీ నిర్మాతలు ఇంకా హిప్పొక్రిటిక్ గా తయారయ్యారు. తమ స్వార్థం తాము చూసుకుంటూ రాజకీయ నాయకులకి కూడా షాక్ ఇస్తున్నారు. ఎవరు పవర్ లో ఉంటే తమ సపోర్ట్ వాళ్లకే అన్నట్లు నిర్మాతలు ప్రవర్తిస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వైయస్ఆర్సీపీ కంటే ముందు టిడిపి రూలింగ్ పార్టీగా ఉన్నప్పుడు అందరూ చంద్రబాబు నాయుడు కే తమ సపోర్ట్ అన్నట్టు ప్రవర్తించారు. కానీ గతేడాది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఒక్కరు కూడా నోరు మెదపలేదు. ఇండస్ట్రీ నుంచి రాఘవేంద్రరావు, అశ్విని దత్ లాంటి నిర్మాతలు తప్ప ఇంకెవరు కనీసం దీని గురించి రియాక్ట్ అవ్వలేదు.
జూనియర్ ఎన్టీఆర్ కూడా కనీసం దీని గురించి మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ నుండి ఎన్టీఆర్ పెద్ద పొందిన సహాయం ఏమీ లేదు కాబట్టి పర్వాలేదు అనుకుందాం. బాలయ్య, చంద్రబాబు నుండి సహాయం ఉన్న చాలా మంది సెలబ్రిటీలు కూడా మౌనం వహించారు.
ఉదాహరణకి మురళీ మోహన్, బోయపాటి శ్రీను, దగ్గుబాటి సురేష్ బాబు వంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా కనీసం మాట్లాడలేదు. అశ్వినీ దత్, రాఘవేంద్ర రావు వంటి వారు కూడా కేవలం ఒక చిన్న ట్వీట్ తో ముగించేశారు. ఇండస్ట్రీకి ఎలాంటి కష్టం వచ్చినా వెళ్లి సహాయం మాత్రం అడుగుతారు కానీ వాళ్లు మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు మాత్రం మౌనంగానే ఉండిపోతున్నారు.
ఒకవేళ ఎవరి గురించైనా సపోర్ట్ చేస్తూ మాట్లాడితే అవతలి పార్టీ వాళ్లు తమ నీ బాయ్కాట్ చేస్తారని, తమకి సినిమాల ఆఫర్లు కూడా రాకుండా చేస్తారేమో అన్న భయంతో సైలెంట్ గా ఉండిపోతున్నారు.
Telugu Producers Pawan Kalyan Meeting:
మళ్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాగానే ఇండస్ట్రీకి ఉన్న కష్టాల గురించి చెప్పుకోవడానికి ఆయన ముందు వాలిపోయారు. ఈ రకంగా తమ స్వార్థం మాత్రమే తాము చూసుకుంటున్న నిర్మాతల తీరు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తుంది.