
Upcoming Telugu Pan-India Projects:
ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రాలు తీయడం ట్రెండ్ అయింది. అయితే ఈ టైంలో ఒక పెద్ద సమస్య ఎదురైంది – ఫైనాన్సింగ్. ఇన్‌స్టిట్యూషనల్ ఫండింగ్ అంటే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు పెద్ద సినిమాలకు ఫండ్స్ ఇవ్వడంలో వెనకడుగేస్తున్నాయి. ప్రత్యేకంగా, కొత్త కంటెంట్ లేదా చిన్న బ్యానర్లు ఉన్నా ఫండింగ్ రాదు.
దీని వల్ల చాలా తెలుగు నిర్మాణ సంస్థలు “స్లీపింగ్ పార్ట్‌నర్స్” కోసం వెతుకుతున్నాయి. అంటే బయటకు రానివాళ్లే అయినా డబ్బు పెట్టే ఇన్వెస్టర్లు. కొన్ని సంస్థలు వీటిని పొందటంతో కాస్త బాగానే నడుస్తున్నాయి. కానీ చాలా కంపెనీలు ఇంకా ఆలోచనలే.
ఇదే సమయంలో ఒక భారీ పాన్ ఇండియా సినిమా గత 2-3 ఏళ్లుగా షూటింగ్‌లో ఉంది. ఇందులో నటిస్తున్న హీరో పేరు చెప్పకుండానే తెలుస్తుంది – ఆయన ఒక పాన్ ఇండియా సూపర్‌స్టార్. అయితే ఈ సినిమా చుట్టూ గాలిలో ఎన్నో పుకార్లు తిరుగుతున్నాయి.
వీటిలో మొదటి విషయం – హీరో కొన్ని సీన్లపై అసంతృప్తితో రీషూట్‌లను కోరాడట. రెండో విషయం – గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ అంచనాలకు చేరలేకపోయాయని టాక్. ఇక అసలైన షాకింగ్ విషయమేమిటంటే, ఈ సినిమాకు ఫైనాన్స్ ఇచ్చిన బాలీవుడ్ సంస్థకు ₹300 కోట్ల వరకు ఇప్పటికే తీసుకున్నారట. కానీ సినిమా పూర్తి కాకుండా డబ్బు అంతా తీయడం వాళ్లకు నచ్చలేదట.
ఇప్పుడు ఆ బాలీవుడ్ సంస్థ లీగల్ యాక్షన్ తీసుకోవాలని పక్కాగా ఆలోచిస్తోందట. ఒకవేళ ఇది కోర్టు వరకు వెళ్లితే సినిమా విడుదలే డిస్ట్రబ్ అవుతుంది. అంతేకాదు, ఈ నిర్మాణ సంస్థకు ఇది చివరి సినిమా కావొచ్చన్న టాక్ వినిపిస్తోంది.
ఇక హీరో అయితే మరో ప్రాజెక్ట్ మీద దృష్టి పెడుతున్నాడు. ఈ సినిమా మాత్రం బ్యాక్ బర్నర్‌కి వెళ్లినట్టు కనిపిస్తోంది.