Telugu OTT Releases This Week: ఒకప్పుడు జనాలు రివ్యూలు చూసి సినిమాలకు వెళ్లేవారు.. ఆ తరువాత కొద్ది రోజులకు సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు చూసి వెళ్లడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ఇదంతా మారిపోయింది. సినిమా ట్రైలర్ చూసి.. ఆ తరువాత సినిమా కథ ఏంటి అని తెలుసుకొని.. థియేటర్స్ కి వెళుతున్నారు ప్రేక్షకులు. ఒకవేళ కథలో వైవిధ్యం లేకపోతే.. లేదా దర్శకత్వ ప్రతిభ కనిపించకపోతే.. ఓటీటీలో చూస్తే చాల్లే అని సరిపెట్టుకుంటున్నారు.
దీని ఫలితమే ఎన్నో సినిమాలు విడుదలైన 10 రోజుల లోపల డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం కావడం. ఈ విషయం ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే.. మొన్న వచ్చిన సత్యదేవ కృష్ణమ్మ సినిమాకి రివ్యూస్ మంచిగా వచ్చాయి. కానీ సినిమా విడుదలైన వారానికే ఓటిటిలోకి వచ్చేసింది. అందుకు ముఖ్య కారణం ఆ సినిమా థియేటర్లో చూడాల్సినంత లేదు అని ప్రేక్షకులు భావించడం.
ఇక మొన్న విడుదలైన గంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా పరిస్థితి కూడా అదే. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం విడుదల చాలా రోజుల నుంచి వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఫైనల్ గా ఒక 14 రోజుల క్రితం ఈ సినిమా థియేటర్స్ లో విడుదల అయింది. సినిమా బాగుంది అంటూ రివ్యూస్ లో.. సోషల్ మీడియాలో ప్రచారం అవసాగింది. కానీ ట్రైలర్ చూసి.. కథ విని.. ఈ సినిమాని కూడా థియేటర్లో చూడాల్సిన అవసరం లేదు అని అనుకున్నారు ప్రేక్షకులు. అందుకు ఫలితమే ఈ చిత్రం 14 రోజుల్లోనే ఓటీటీ స్త్రీమింగ్ సిద్ధం కావడం.
కాబట్టి ప్రేక్షకులు సినిమాలో నిజంగా సత్తా ఉంటేనే థియేటర్స్ కి వెళ్లాలనుకుంటున్నారు.. లేదు అంటే సోషల్ మీడియాలో చెప్పినా.. రివ్యూస్ రాసిన.. ఎంత పాజిటివ్ టాక్ వచ్చిన.. ఆ చిత్రాన్ని ఓటీటీలో చూస్తే చాల్లే అనే భావనకు వచ్చేశారు. ఇక ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే సినిమా విడుదలైన రెండు రోజులకే ఓటీటీలో వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు.