2020వ సంవత్సరం చాలా అవరోదాల మథ్య కష్టంగా గడిచింది. చిన్న పెద్ద అని తేడాలేకుండా అందర్నీ తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. సినిమా పరిశ్రమ సైతం అల్లాడిపోయింది. సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. విడుదలకు రెడీగా ఉన్న సినిమాలు థియేటర్స్ మూతపడ్డటంతో రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. ఈ టైమ్‌లో ఓటీటీ పెద్ద అసరాగా నిలిచింది. ఓటీటీ వేదికగా విడుదలైన తొలి తెలుగు సినిమా ‘అమృతరామమ్’. తరువాత స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచుకున్న కీర్తిసురేష్ నటించిన పెంగ్విన్. కృష్ణ అండ్ హిజ్ లీలా, భానుమతి కృష్ణమూర్తి, ఉమా మహేశ్వరా ఉగ్ర రూపస్య, జోహర్, నాని మరియు సుధీర్ బాబు నటించిన ‘వి’, ప్రముఖ నటి అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ కూడా ఓటీటీలో విడుదలైయ్యాయి. ఇక టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన ‘ఓరేయ్ బుజ్జిగా’, కలర్ ఫొటో, ఆనంద్ దేవరకొండ నటించిన మిడిల్ క్లాస్ మెలోడిస్ ఓటీటీలో సందండి చేశాయి. వీటిలో కొన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరికొన్ని నిరాశ పరిచాయి. స్టార్ హీరోలు ఓటీటీలో తమ సినిమాను విడుదల చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఆగిపోయాయి. దీంతో న్యూయార్‌కి కొన్ని.. సంక్రాంతి బరిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ ఒకటి. ఇక ఈ సంవత్సరం పలు భారీ బజ్డెట్, పాన్ ఇండియా సినిమాలను కూడా ప్రకటించారు. అందులో మెగాస్టార్ ఆచార్య, ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ దశలో ఉన్నది. ఇక ఆదిపురుష్, సలార్ సినిమాలు ఫ్రీ ప్రోడక్షన్ దశలో ఉన్నాయి.