HomeTelugu Trending'యూకే ఆసియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌'లో..'తెలుగు ఇండీ' సినిమా 'ముత్తయ్య'

‘యూకే ఆసియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో..’తెలుగు ఇండీ’ సినిమా ‘ముత్తయ్య’

Telugu indie film muthayya
‘పుష్ప: ది రైజ్‌’, ‘ఆర్ఆర్‌ఆర్’ వంటి భారీ బడ్జెట్ తెలుగు చిత్రాలు దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోయిన విషయం తెలిసిందే. అయితే ఎవరికీ తెలియని విషయం ఏంటంటే.. గత కొన్నేళ్లుగా పలు ఇండీ-స్పిరిటెడ్ టాలీవుడ్‌ సైతం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటున్నాయనేది. ప్రస్తుతం అంతర్జాతీయ సర్క్యూట్‌లో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధంగా ఉన్న కొత్త ‘తెలుగు ఇండీ’ చిత్రం ‘ముత్తయ్య’. ఈ మూవీ ‘యూకే ఆసియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ప్రదర్శించేందుకు తాజాగా ఎంపికైంది. మే 9న లండన్‌లోని రిచ్‌ మిక్స్‌లో ప్రీమియర్‌గా ‘ముత్తయ్య’ ప్రదర్శించబడనుంది. యూరప్‌లో సుధీర్ఘకాలం ప్రదర్శించబడుతున్న దక్షిణాసియా చలనచిత్రోత్సవాల్లో ‘యూకే ఆసియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ ఒకటి.

‘ముత్తయ్య’ సినిమా విషయానికొస్తే.. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చందమామ కాజల్‌ అగర్వాల్‌ సోషల్ మీడియా వేదికగా లాంచ్‌ చేసింది. ఈ పోస్టర్‌లో థియేటర్‌లో వెండితెరను చూస్తూ ఒక పెద్దాయన నిలుచొని ఉండటం మనం చూడొచ్చు. ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో ‘కొత్త పోరడు’ వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ కె సుధాకర్‌ రెడ్డి నటించారు. ఆయనతోపాటు అరుణ్‌ రాజ్‌, మౌనిక బొమ్మ, పూర్ణ చంద్ర వంటి కొత్తవారు కూడా కీలక పాత్రల్లో అలరించనున్నారు. ఈ మూవీకి కొత్త డైరెక్టర్‌ భాస్కర్‌ మౌర్య దర్శకత్వం వహించారు. కార్తీక్‌ రోడ్రిగ్జ్‌ సంగీతం అందించగా, సినిమాటోగ్రాఫర్‌గా దివాకర్‌ మణి పనిచేశారు. ఫిక్షనరీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై బృందా ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించగా, హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవైట్ లిమిటెడ్‌కు చెందిన కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సమర్పిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu