నిర్మాతల మండలి ఎన్నికల ఎంతో ఉత్కంఠ గా జరిగాయి. తెలుగు నిర్మాతల మండలి నూతన అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ ఎన్నికయ్యారు. జెమినీ కిరణ్‌పై 17 ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్ విజయం సాధించారు. మొత్తం ఓట్లు 1,134 ఓట్లు కాగా.. పోలైన ఓట్లు 677. వీటిలో దామోదర ప్రసాద్‌కు 339 ఓట్లు పోలవగా.. జెమినీ కిరణ్‌కు 322 ఓట్లు వచ్చాయి.
నిర్మాతల మండలి కార్యదర్శులుగా ప్రసన్నకుమార్, వైవీఎస్ చౌదరి, జాయింట్ సెక్రటరీలుగా భరత్ చౌదరి, నట్టికుమార్ ఎన్నికయ్యారు. నిర్మాతల మండలికి సాధారణంగా షెడ్యూల్ ప్రకారం ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించలేదు. అయితే కొన్ని రోజుల క్రితం చిన్న నిర్మాతలు ఎన్నికలు నిర్వహించాలని ఆందోళన చేపట్టడంతో ఇవాళ హైదరాబాద్‌లో ఎన్నికలు నిర్వహించారు.
సరికొత్త మెంబర్స్:
దిల్ రాజు 470, దానయ్య 421, రవి కిషోర్ 419, యలమంచిలి రవి 416, పద్మిని 413, బెక్కం వేణుగోపాల్ 406, సురేందర్ రెడ్డి 396, గోపీనాథ్ ఆచంట 353, మధుసూదన్ రెడ్డి 347, కేశవరావు 323, శ్రీనివాస్ వజ్జ 306, అభిషేక్ అగర్వాల్ 297, కృష్ణ తోట 293, రామకృష్ణ గౌడ్ 286, కిషోర్ పూసలు 285 ఓట్లతో గెలిచారు.