HomeTelugu Trendingప్రణబ్ ముఖర్జీ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు దిగ్ర్భాంతి..

ప్రణబ్ ముఖర్జీ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు దిగ్ర్భాంతి..

Telugu CMs condolences on P
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూయడంపై తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ప్రణబ్ ముఖర్జీ ప్రాణాలు కాపాడడానికి వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ అంశంతో ప్రణబ్ కు ఎంతో అనుబంధం ఉందని సీఎం అన్నారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి నాయకత్వం వహించిన ప్రణబ్, చివరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌లో న్యాయం ఉందని భావించే వారని, తాను కలిసిన ప్రతీ సారి ఎన్నో విలువైన సూచనలు చేసే వారని గుర్తు చేసుకున్నారు సీఎం కేసీఆర్.

ఒక నాయకుడికి ఉద్యమాన్ని ప్రారంభించి, విజయతీరాలకు చేర్చే అవకాశం దక్కడం అరుదుగా సంభవిస్తుందని, ఆ ఘనత తనకు (కేసీఆర్ కు) దక్కిందని ప్రణబ్‌ ముఖర్జీ తనను ప్రత్యేకంగా అభినందించారని కేసీఆర్ చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ రాసిన ‘ద కొయలేషన్ ఇయర్స్’ పుస్తకంలో కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారని, కేసీఆర్‌కు తెలంగాణ అంశమే తప్ప పోర్టు ఫోలియో అక్కరలేదని పేర్కన్నారని గుర్తు చేశారు. దీనిని బట్టి తన జీవితకాలంలో తెలంగాణ అంశాన్ని అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నదిగా గుర్తించినట్లు అర్థమవుతున్నదని కేసీఆర్ అన్నారు. యాదాద్రి దేవాలయన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను అభినందించారని గుర్తుచేసుకున్న కేసీఆర్.. ప్రణబ్ మరణం తీరని లోటని సీఎం బాధను వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తన తరుఫున, తెలంగాణ ప్రజల తరుఫున ప్రణబ్‌కు నివాళి అర్పించారు. ప్రణబ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం కేసీఆర్.

ఏపీ సీఎం జగన్ కూడా ప్రణబ్ ముఖర్జీ మృతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి రాజకీయ నాయకుడు, భారత రత్న అవార్డ్ అందుకున్న ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు తన విచారాన్ని వ్యక్తం చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో క్లిష్టమైన సమస్యల పరిష్కారంలో ఆయన సమర్థంగా వ్యవహరించారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నట్టు ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu