HomeTelugu Big Stories'బిగ్‌బాస్‌ -4'లో ఆ నలుగురు .. మరి హోస్ట్‌ ఎవరో తెలుసా!

‘బిగ్‌బాస్‌ -4’లో ఆ నలుగురు .. మరి హోస్ట్‌ ఎవరో తెలుసా!

8 22

లాక్‌డౌన్ వ‌ల్ల అన్ని షూటింగ్‌ల‌కు వాయిదా పడ్డాయి. సినిమాలు, సీరియళ‌్లు ఎక్క‌డిక‌క్క‌డ ఆగిపోయాయి. దీంతో తెలుగు ప్రేక్ష‌కులు ఎంత‌గానో అభిమానించే బిగ్‌బాస్ రియాలిటీ షో ఈసారి ఉంటుందా? లేదా అని అభిమానులు తెగ కంగారుప‌డ్డారు. కానీ ఆరు నూరైనా బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్ తెర‌కెక్కిస్తాం అంటోంద‌ట స్టార్ మా యాజ‌మాన్యం. ఇప్ప‌టికే అందుక‌వ‌స‌ర‌మ‌య్యే ప‌నుల‌ను ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది.

తెలుగు నాట బిగ్‌బాస్ షోకు ఉన్న ఆద‌ర‌ణ మ‌రింకే ప్రోగ్రామ్‌కు లేద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఇక రియాల్టీ షోలు గురించి చెప్పాకర్లేదు. అయిత బిగ్‌బాస్‌ షోకి ప్రేక్షకుల్లో ఎంత ఆదరణ ఉందో తెలిసిందే. బిగ్‌బాస్ ప్రారంభ‌మ‌య్యే స‌మ‌యానికి ప్రేక్ష‌కులు టీవీల‌కు అతుక్కుపోతారు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పటికే బిగ్‌బాస్ మూడు సీజ‌న్ల‌ను విజ‌యవంతంగా పూర్తి చేసుకుంది. హీరోలు నాని, ఎన్టీఆర్, నాగార్జున వ‌రుస‌గా మూడు సీజ‌న్ల‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. నాల్గొవ సీజ‌న్‌కు తొలుత సూపర్‌ స్టార్‌ మ‌హేష్‌బాబు హోస్ట్ చేయ‌నున్నాడ‌ని వార్త‌లు వచ్చినప్పటికీ.. అది అంత సుల‌భం కాద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో మ‌రోసారి నాగార్జునే క‌నిపించ‌నున్నాడా? లేక ప్రిన్స్ మ‌హేశ్‌బాబే హోస్ట్‌గా తెర‌పై తీసుకు వస్తారా..అనేది వేచి చూడాల్సిన అంశం.

బిగ్‌బాస్ కార్యక్ర‌మం సాధార‌ణంగా జూలైలో ప్రారంభం కావాల్సి ఉంటుంది. అయితే ఈసారి కాస్త లేట‌య్యేట్టున్నా .. త‌గు జాగ్ర‌త్త‌లతో వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేవారిని ఎంపిక చేసే ప‌నిలో ప‌డ్డారు. అయితే అందులో కొంత‌మంది పేర్ల‌ను లీకువీరులు బ‌య‌ట‌పెట్టేశారు. తెలంగాణ ముద్దు బిడ్డ మంగ్లీ, హీరో త‌రుణ్‌, యాంక‌ర్ వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్‌, సీరియ‌ల్ న‌టుడు అఖిల్ సార్థ‌క్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ న‌లుగురి పేర్లు ఫైన‌ల్ లిస్టులో ఉంటాయా? లేదా? ఇంకా ఎవ‌రెవ‌రు ఉంటారు? అనేది తెలియాలంటే అధికారికంగా ప్రకటించే వరుకు వేచి చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu