తెలుగు ‘బిగ్ బాస్ -3’ పది ఎపిసోడ్‌లను ముగించుకుని బుధవారం నాడు పదకొండో ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. హౌస్‌లో కరెంట్, గ్యాస్ కోసం సైకిల్ యాత్ర చేపట్టారు కంటెస్టెంట్స్..
పదర.. పదరా.. అంటూ ఊపిచ్చే సాంగ్‌ను హౌస్‌లో ప్లే చేయడంతో కాకరేపే స్టెప్పులతో రచ్చ చేసింది తమన్నా సింహాద్రి. శ్రీముఖి-బాబా భాస్కర్‌ల మధ్య సరదా సరదా సన్నివేశాలతో ఎపిసోడ్ ప్రారంభం కాగా.. తమన్నా సింహాద్రి చీపురు పట్టుకుని అలీకు చుక్కలు చూపించింది. స్నానం చేసి టవల్‌తో బయటకు వస్తున్న అలీని చూస్తూ తమన్నా.. హౌస్‌లో ఈ ఎక్స్‌పోజింగ్ ఏంటి అంటూ ప్రశ్నించింది. నాకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు నాకు లేదా బిగ్‌బాస్ అంటూ సరదాగా మాట్లాడారు అలీ. నువ్వు అలా విప్పుకుని తిరిగితే కుదరదని తమన్నా అనడంతో.. నా డ్రెస్ గురించి మీరు ఎందుకు అడుతున్నారు. మీ డ్రెస్‌ల గురించి మేం మాట్లాడటం లేదు కదా అంటూ టవల్‌తోనే తెగ ఎక్స్‌పోజ్ చేస్తూ సమాధానం ఇచ్చారు అలీ. మరోవైపు ప్లేట్‌లో తినేసి కడగకుండా అక్కడ పెట్టేసిందంటూ.. తమన్నాను టార్గెట్ చేయడంతో తమన్నా విశ్వరూపం చూపించింది. ఇక్కడ ఎవడూ పెత్తనం చేయొద్దు. నేను ప్లేట్‌లో తినలేదు. బౌల్‌లో తిన్నా.. బౌల్ కడిగేశా. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ హౌస్ మేట్స్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చింది తమన్నా
ఈవారం లగ్జరీ బడ్డెట్‌లో భాగంగా మహేష్‌కి బిగ్‌బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఒక దీపాన్ని ఇచ్చి దాన్ని ఆరిపోకుండా కాపాడాలని కండిషన్ పెట్టారు బిగ్ బాస్. అయితే దీపం చుట్టూ శివజ్యోతి సలహా మేరకు అట్టముక్కలు అడ్డుపెట్టి దీపం ఆరిపోకుండా చూసే ప్రయత్నం చేశారు మహేష్. ఈలోపు బిగ్ బాస్.. దీపం చుట్టూ ఎలాంటివి అడ్డుపెట్టకూడదని కండిషన్ పెట్టడంతో వరుణ్‌తో పాటు వితికా, పునర్నవి అండ్ బ్యాచ్ చప్పట్లు కొట్టడంతో హర్ట్ అయ్యింది శివజ్యోతి.
నేను చెప్పిన సలహా నచ్చకపోతే అప్పుడే చెప్పాలి కాని.. ఇలా చప్పట్లు కొట్టి అవమానించడం కరెక్ట్ కాదు. నేను హౌస్ కోసమే సలహా ఇచ్చా. ఎందుకు సెపరేట్ టీమ్‌గా ఏర్పడి హేళన చేస్తారని ఏడ్చేసింది శివజ్యోతి. అయితే కాసేపు శివజ్యోతితో వాదించిన వరుణ్.. తప్పునాదేలే సారీ అనడంతో.. నిన్ను సారీ అడిగానా? చప్పట్లు కొట్టారు అంటే నువ్వు ఎందుకు రియాక్ట్ అవుతున్నావని మరింత ఏడ్చేసింది శివజ్యోతి.
ఇక వాళ్లంతా అమ్మలక్కలు అలాగే మాట్లాడుకుంటారు.. మనం ఏదో సరదాగా చప్పట్లు కొడితే తెగ ఫీల్ అయిపోతుంది అంటూ వరుణ్, వితికాలతో ముచ్చట్లు పెట్టింది పునర్నవి.
అనంతరం ఈవారం లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా శ్రీముఖి, అలీలకు పిడకలు వేసే పనిని అప్పగించారు బిగ్ బాస్. నిర్ణీత సమయానికి 100 పిడికలు వేయాలని బిగ్ బాస్ ఆదేశించడంతో శ్రీముఖి, అలీలు పిడకల యుద్ధం మొదలుపెట్టి.. వంద కంటే ఎక్కువ పిడకలే కొట్టి.. ఇంటికి గ్యాస్ కొరతను తీర్చుకున్నారు.
గేమ్‌లో పోటీ పడి పిడకలు కొట్టి గెలిచిన శ్రీముఖి.. అలీని హగ్‌లతో ఉక్కిరి బిక్కిరి చేసింది. గెలిచిన ఆనందంలో అమ్మాయిలకు కిస్‌లు ఇస్తూ.. అలీకి కౌగిలి అందించింది.
ఇక వాటర్ ప్రాబ్లమ్‌ని తీర్చుకోవడానికి మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌ని వరుణ్ భార్య వితికాకు అప్పగించారు. ఒకతొట్టెలో చేపలతో పాటు కొన్ని కాయిన్స్ ఇచ్చి వీటిలో యాభై వెతకాలి.. ఈ టాస్క్‌ను దిగ్విజయంగా పూర్తి చేసి నీటి కొరతను తీర్చారు. మరోవైపు మహేష్ కూడా దీపాన్ని ఆరిపోకుండా జాగ్రత్తగా కాపాడటంతో ఈవారం లగ్జరీ బడ్జెట్‌ను సాధించారు కంటెస్టెంట్స్.
అయితే గత సీజన్‌లో తొలివారంలోనే జైలు శిక్షను ప్రారంభించిన బిగ్ బాస్.. ఈ సీజన్‌లో రెండో వారంలో జైలు శిక్షను షురూ చేశారు. ఇందుకోసం హౌస్‌లో ఉన్న 15 మంది కంటెస్టెంట్స్‌లో చెత్త పెర్ఫామెన్స్ ఇచ్చిన ఇద్దరి పేర్లు సూచించాలని బిగ్ బాస్ ఆదేశించగా.. ఎవరూ పేర్లు చెప్పడానికి ముందుకు రాకపోవడంతో తమన్నా, వరుణ్‌లు తమకు తామే చెత్త పెర్ఫామెన్స్‌గా ప్రకటించుకుని బిగ్ బాస్‌కి తమ పేర్లను చెప్పారు.
దీంతో బిగ్ బాస్ ఈ ఇద్దర్నీ తదుపరి ఆదేశం వచ్చేంతవరకూ జైల్‌లో ఉండాలని కోరారు. అనంతరం కోరిమరీ జైలుకు వెళ్లిన తమన్నా.. నాకు ఏసీ లేకపోతే నిద్ర పట్టదు అంటూ గుక్కపెట్టి ఏడ్చేసింది. ఇక శ్రీముఖి నేతృత్వంలో తమన్నాకు ఓదార్పు యాత్ర లభించింది. మొత్తానికి బుధవారం నాటి ఎపిసోడ్.. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లతో జైలు శిక్షలతో ఇంట్రస్టింగ్‌గానే నడించింది.