తెలుగు ‘బిగ్ బాస్-3’ నేడు మంగళవారం పదో ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. 15 మంది కంటెస్టెంట్స్‌లో హేమ తొలి ఎలిమినేషన్ కాగా.. వైల్డ్ కార్డ్‌తో హౌస్‌లోకి తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇవ్వడంతో గేమ్ రంజుగా మారింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లో అడుగుపెట్టిన తమన్నా సింహాద్రి ఆట మొదలుపెట్టింది. అయితే ఈ రోజు ఇంట్లో జరిగిన హంగామా చూద్దామా.. అర్ధరాత్రి అందరూ పడుకున్నాక.. రవికృష్ణ మైక్‌లు దాచేసి ఉదయం అతనితో ఏమైందిరా పండు అంటూ ఆడుకుంది.
ఇక వరుణ్ సందేశ్ భార్య వితికాకి మిగిలిన కంటెస్టెంట్స్‌తో చిన్న డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. మరోవైపు వరుణ్ ఒడిలో తలపెట్టుకుని పడుకుని ముచ్చట్లు పెట్టింది. మధ్యలో పునర్నవి కల్పించుకుని వదినా.. చికెన్ చేస్తున్నావా? వదినా హూ.. హూ.. అంటూ తమన్నాను ఇమిటేట్ చేసింది.
ఇక బిగ్ బాస్‌లో గ్యాస్, కరెంట్‌ను వృధా చేస్తున్నారని కంటెస్టెంట్స్‌కి బిగ్ బాస్ శిక్ష విధించారు. వాటి విలువ తెలుసుకోవడం కోసం.. మూడు సైకిల్స్ ఇచ్చి వాటిని తొక్కడం ద్వారా గ్యాస్, కరెంట్లను ఉత్పత్తి చేసుకోవాలని లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ముందుగా శ్రీముఖి సైకిల్ ఎక్కడంతో ఒకరి తరువాత ఒకరు అని కాకుండా.. టీంలుగా డివైడ్ అయ్యి సైకిల్ తొక్కితే బాగుంటుందని శివజ్యోతి గొడవ మొదలుపెట్టింది. నేను కూడా ముందు సైకిల్ తొక్కుతా.. నైట్ పడుకోవాలని తమన్నా సింహాద్రి. రచ్చ చేసింది. అందరూ టాస్క్‌లో పార్టిసిపేట్ చేస్తుంటే.. నువ్వు ఒక్కదానివి వంటగదిలో ఉండటం కరెక్ట్ కాదు.. నువ్వు కూడా ఇన్వాల్వ్ అవ్వు అని పునర్నవి.. వితికాతో అనడంతో వివాదం మొదలైంది. నేను దోసెలు వేస్తున్నా.. నువ్వు ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నావు.. అంటూ వితికా ఫైర్ అయ్యింది.
అయితే అక్కడే ఉన్న వరుణ్ సందేశ్.. పునర్నవిని సపోర్ట్ చేయడంతో గుక్కపెట్టి ఏడ్చేసింది వితికా. కాసేపు వరుణ్-వితికాల మధ్య డిస్కషన్ జరగడం.. మిగిలిన మహిళా కంటెస్టెంట్స్ ఓదార్చడం.. ఇలా కాసేపు నాటకీయంగా మారింది. ఫైనల్‌గా వరుణ్.. వితికా చేతిలో చేయి వేసి క్షమించమని కోరడంతో కరిగిపోయిన వితికా కూడా వరుణ్‌కి సారీ చెప్పింది. మొత్తానికి వితికా- పునర్నవిల మధ్య మొదలైన గొడవ.. భార్యా భర్తల మధ్య రచ్చ రేపి సుఖాంతం అయ్యింది.
ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తమన్నా.. శ్రీముఖి గురించి తాను ఏదో అనుకున్నాను కాని.. ఇక్కడ అంత లేదు అని అనడంతో ఆమెకు జతకలిశాడు జాఫర్. నేను ఆమె క్రేజ్ చూసి ఏదో అనుకున్నాను కాని.. జస్ట్ అందరిలాగే ఆమె కూడా అంటూ తమన్నాతో మాట కలిపారు.
ఈరోజు చిన్న చిన్న తగాదాలు.. ఓదార్పు యాత్రలతో సాగిన బిగ్ బాస్ ఎపిసోడ్.. రేపు మరింత రంజుగా సాగేట్టు కనిపిస్తుంది. తీన్మార్ సావిత్రి- వరుణ్ సందేశ్‌ల మధ్య వివాదం రేగింది. నాదే తప్పు సారీ.. అని వరుణ్ అనడంతో ఏడుపు మొదలు పెట్టింది సావిత్రి. మరి ఏమి జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి.