HomeTelugu Trendingబిగ్‌బాస్‌: 15వ ఎపిసోడ్‌ హైలైట్స్‌.. జాఫర్‌ ఔట్‌

బిగ్‌బాస్‌: 15వ ఎపిసోడ్‌ హైలైట్స్‌.. జాఫర్‌ ఔట్‌

10 2తెలుగు ‘బిగ్ బాస్-3’లో మరో ఆసక్తికర ఎపిసోడ్ ఇది. పునర్నవి, జాఫర్, వరుణ్ సందేశ్, వితికా షెరులలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఉంది. అయితే, జాఫర్ ఎలిమినేట్ అయిపోతున్నట్టు ఆదివారం ఉదయం నుంచే వార్తలు మొదలయ్యాయి. వాటిని నిజం చేస్తూ జాఫర్ ‘బిగ్ బాస్’ హౌస్‌ నుంచి బయటికి వచ్చేశారు.

ఆదివారం నాటి 15వ ఎపిసోడ్‌లో నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ‘మనం’ సినిమాలోని ‘పియో పియో రే’ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన నాగ్‌.. వచ్చీ రాగానే మన టీవీ ద్వారా హౌస్‌లోని కంటెస్టెంట్లను పలకరించారు. అందరికీ ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, ఫ్రెండ్‌షిప్ డే టాస్క్ కూడా ఇచ్చారు.

కెప్టెన్ వరుణ్ సందేశ్‌ను స్టోర్ రూంలో ఉన్న బౌల్‌ను తీసుకురమ్మని నాగార్జున సూచించారు. వరుణ్ తెచ్చిన బౌల్‌లో ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్ ఉన్నాయి. ఒక్కో కంటెస్టెంట్ ఒక ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌ను తీసుకొని ఇంటిలోని సభ్యుల్లో ఇష్టమైన ఒకరికి కట్టాలని నాగార్జున సూచించారు. ఆ బ్యాండ్ ఆ వ్యక్తికి ఎందుకు కట్టారు అనడానికి సరైన కారణం కూడా చెప్పాలని షరతు పెట్టారు. దీంతో హౌస్‌మేట్స్ అందరూ ఈ టాస్క్‌ను పూర్తిచేశారు.

ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లు కట్టిన జాబితా.. శ్రీముఖి – బాబా భాస్కర్, హిమజ – మహేష్ విట్ట, జాఫర్ – రోహిణి, బాబా భాస్కర్ – జాఫర్, రవికృష్ణ – అలీ, మహేష్ విట్ట – అశురెడ్డి, వరుణ్ – రాహుల్, వితికా షెరు – పునర్నవి, శివజ్యోతి – హిమజ, తమన్నా – శ్రీముఖి, పునర్నవి – వితికా షెరు, రోహిణి – తమన్నా, అలీ – రవికృష్ణ, అశురెడ్డి – శివజ్యోతి, రాహుల్ – వరుణ్ సందేశ్. ఈ టాస్క్ జరుగుతున్న క్రమంలోనే పునర్నవిని నాగార్జున సేఫ్ జోన్‌లో వేసేశారు.

10a

‘ఇస్మార్ట్ శంకర్’ జోడి ఎనర్జిటిక్ స్టార్ రామ్, నిధి అగర్వాల్ ‘బిగ్ బాస్’ షోలో సందడి చేశారు. ముందుగా రామ్‌ను ఆహ్వానించిన నాగార్జున.. ఆ తరవాత నిధికి స్వాగతం పలికారు. వీరిద్దరితో కలిసి స్టెప్పులేశారు. వీరిని హౌస్‌మేట్స్‌కి పరిచయం చేసిన నాగార్జున.. ఆ తరవాత మరో టాస్క్‌ను ఇంటి సభ్యులకు ఇచ్చారు. కెప్టెన్ వరుణ్ స్టోర్ రూమ్‌లోని బ్యాడ్జీలను తీసుకొచ్చారు. ఒక్కో బ్యాడ్జీపై ఒక్కో సినిమా పేరు ఉంది.

రామ్, నాగ్, నిధి ఒకరి తరవాత ఒకరు ఒక సినిమా పేరును చెప్పారు. ఈ సినిమా పేరు ఇంట్లోని ఎవరికి సరిగ్గా సరిపోతుందో ఊహించి వారికి ఒక్కో ఇంటి సభ్యుడు ఆ బ్యాడ్జీని తగిలించాల్సి ఉంటుంది. దీనికి సరైన కారణం కూడా చెప్పాలి. ఇలా ఒక్కో హౌజ్‌మేట్ బ్యాడ్జీ ఎవరికి తగిలించారనే వివరాలు కింద ఉన్నాయి. బ్రాకెట్‌లో పేరు బ్యాడ్జీ తగిలించిన వ్యక్తిది.
ఇస్మార్ట్ శంకర్ – అలీ (జాఫర్)
బ్లఫ్ మాస్టర్ – వితికా షెరు (వరుణ్ సందేశ్)
దేశముదురు – శ్రీముఖి (వితికా షెరు)
దొంగోడు – రాహుల్ (పునర్నవి)
అర్జున్ రెడ్డి – రోహిణి (అశురెడ్డి)
సరైనోడు – బాబా భాస్కర్ (మహేష్ విట్ట)
ఊసరవెల్లి – తమన్నా (హిమజ)
డిక్టేటర్ – వరుణ్ సందేశ్ (రోహిణి)
పోకిరి – శ్రీముఖి (రాహుల్)
మహానటి – పునర్నవి (రవికృష్ణ)
జులాయి – తమన్నా (అలీ)
సుడిగాడు – హిమజ (శివజ్యోతి)
రోబో – బాబా భాస్కర్ (తమన్నా)
గోపి – రాహుల్ (శ్రీముఖి)
కంత్రి – తమన్నా (బాబా భాస్కర్)

ఈ టాస్క్ పూర్తికాగానే డేంజర్ జోన్‌లో ఉన్న ముగ్గురిలో సేఫ్ జోన్‌లోకి వెళ్లిన ఒకరిని ప్రకటించారు. వరుణ్ సందేశ్ సేఫ్ అని రామ్ ప్రకటించారు. ఇక ఎలిమినేషన్‌లో ఇక మిగిలింది వితికా షెరు, జాఫర్. వీరిద్దరిలో ఎవరు ఇంటిలో ఉండాలని కోరుకుంటున్నారని హౌస్‌మేట్స్‌ని నాగార్జున అడిగారు. ఏడుగురు జాఫర్ ఉండాలని కోరుకోగా.. ఆరుగురు వితికా హౌస్‌లో ఉండాలని చెప్పారు. అయితే, ప్రేక్షకులు వేసిన ఓట్లు ఆధారంగా జాఫర్ ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించారు.

హౌస్‌ నుంచి బయటికి వచ్చిన జాఫర్‌.. నాగార్జునతో కలిసి వేదిక పంచుకున్నారు. వేదికపైకి వచ్చిన తరవాత జాఫర్ మాట్లాడుతూ.. తాను ఈ షోలోకి వచ్చినప్పుడు ఇదంతా స్క్రిప్ట్ అని అనుకున్నాని చెప్పారు. ఇంట్లోకి వెళ్లిన రెండు రోజుల వరకు తన మనసులో ఇదే ఆలోచన ఉందన్నారు. కానీ, ఇప్పుడు అదంతా తప్పని తనకు తెలిసిందన్నారు. హౌస్‌లో ఉన్న వారంతా చాలా నిజాయతీగా ఆడుతున్నారని చెప్పారు. ఆ తరవాత మన టీవీ ద్వారా హౌస్‌మేట్స్ అందరినీ జాఫర్ పలు ప్రశ్నలు అడిగారు. హౌస్‌లో రెండు గ్రూపులున్నాయని తన ప్రశ్నల ద్వారా జాఫర్ తెలియజేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu