HomeTelugu Trendingవామ్మో Mahalakshmi Scheme తో ఎన్ని ఉచిత బస్ ప్రయాణాలు జరిగాయో తెలుసా?

వామ్మో Mahalakshmi Scheme తో ఎన్ని ఉచిత బస్ ప్రయాణాలు జరిగాయో తెలుసా?

Telangana's Mahalakshmi Scheme creates a revolution with free trips!
Telangana’s Mahalakshmi Scheme creates a revolution with free trips!

Free Bus Trips with Mahalakshmi Scheme:

తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2023 డిసెంబర్ 9న ప్రారంభించిన మహాలక్ష్మి ఉచిత బస్ ప్రయాణ పథకం మహిళల జీవితాల్లో పెనుమార్పులు తీసుకువచ్చింది. ఈ పథకంతో ఇప్పటివరకు మహిళలు 125.50 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారు, దాని విలువ రూ. 4,225 కోట్లు. దాదాపు తెలంగాణలోని ప్రతి మహిళ ఈ పథకాన్ని ఎన్నోసార్లు వినియోగించుకుంది.

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో ప్రయాణికుల సంఖ్య 27 శాతం పెరగడం మహాలక్ష్మి పథకం విజయాన్ని హైలైట్ చేస్తోంది. పథకం ప్రారంభానికి ముందు TGSRTC బస్సులలో రోజూ 45 లక్షల మంది ప్రయాణిస్తుండగా, ఇప్పుడు ఈ సంఖ్య 58 లక్షలకు పెరిగింది. ఈ పెరుగుదలతో TGRTC 2024లో 1389 కొత్త బస్సులను సేవలోకి ప్రవేశపెట్టింది.

మహాలక్ష్మి పథకం మహిళల ఆర్థిక, సామాజిక జీవితాలను కూడా ప్రభావితం చేసింది. ముందుగా RTC ప్రయాణికులలో 40 శాతం మహిళలే ఉండగా, ఇప్పుడు ఈ శాతం 65 శాతానికి పెరిగింది. మహిళలకు ప్రయాణ ఖర్చులను ఆదా చేయడంతో పాటు, వారి ఆదాయంలో కొంత భాగం మిగల్చుకునే అవకాశం ఈ పథకం కల్పిస్తోంది.

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “రేవంత్ సర్కారు ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ మహాలక్ష్మి ఉచిత బస్ ప్రయాణాన్ని మొదటిరోజుల్లోనే ప్రారంభించింది. ఈ పథకంతో TGRTC కూడా ఆదాయాన్ని పెంచుకోవడం విశేషం. ప్రభుత్వ నిధుల ద్వారా ఈ పథకాన్ని మరింత బలోపేతం చేయడం జరుగుతోంది,” అన్నారు.

ALSO READ: 2025 Sankranti releases టికెట్ రేట్లు భారీగా పెంచేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం!

Recent Articles English

Gallery

Recent Articles Telugu