దేశమంతటా లాక్‌డౌన్ నిబంధనలు కొనసాగుతున్నా కొందరు మాత్రం అవేమీ లెక్కచేయకుండా రోడ్లపైకి వస్తున్నారు. అవసరం లేకున్నా రోడ్లపైకి వస్తూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని పోలీసులు మండిపడుతున్నారు. అందుకే రోడ్లపై జనాలు కనిపిస్తే లాఠీలకు పనిచెప్తున్నారు. కొందరు అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారు. పనిలేకున్నా బైక్‌పై ఇద్దరేసి వస్తున్నారు. ముఖ్యంగా యువకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పలుచోట్ల కనిపిస్తోంది.
అందుకే హైదరాబాద్‌లో పోలీసులు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించేవారిపై కొరడా ఝళిపిస్తున్నారు. నిత్యావసరాల కోసం అయినా 3 కిలోమీటర్లు దాటి వెళ్లిన వాహనాలను గుర్తించి భారీగా ఫైన్ వేస్తున్నారు. అలాంటి వాహనం నెంబరు, డ్రైవింగ్ లైసెన్సు మరియు నెంబరును యాప్‌లో నమోదు చేస్తున్నారు. దీనికోసం పోలీసులు ‘ఆటోమేటిక్ పర్సన్ ఐడెంటిఫికేషన్ సిస్టం’ అనే యాప్‌ను వినియోగిస్తున్నారు.