తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ .. టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జునలతో ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో తెలుగు చలన చిత్ర రంగానికి సంబంధించిన పలు విషయాలతో పాటు తాజాగా రాజకీయ అంశాలు వీళ్ల మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. చిరంజీవి ఇంట్లో ఈ సమావేశం జరిగింది. చిరు ఇంటికే నాగార్జున, తలసాని శ్రీనివాస్ యాదవ్ విచ్చేసారు. మొన్నటి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంగా టీఆర్ఎస్ ప్రభంజనం వీచడం.. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తలసానిని చిరు, నాగార్జునలతో భేటి కమ్మని ముఖ్యమంత్రి కేసీఆర్ పంపించినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్.. బీజేపీ పంచన చేరడం. మరోవైపు చిరంజీవి ఇటు తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సన్నిహితంగా మెలగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి తలసానితో చిరంజీవి, నాగార్జున భేటీ కావడం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకిత్తించింది. చిరంజీవి విషయానికొస్తే.. ప్రస్తుతానానికి చిరంజీవి తన దృష్టిని కేవలం సినిమాలకే పరిమితం చేసారు. మళ్లీ రాజకీయాల వైపు దృష్టిసారింలేదు. ఈ నేపథ్యంలో చిరు.. మరోసారి రాజకీయాలపై దృష్టి మరలుస్తారా అనేది కీలకంగా మారింది. మొత్తంగా రెండు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ ఉన్న ఈ సమయంలో తలసాని.. తెలుగులో సీనియర్ నటులైన నాగార్జున, చిరంజీవిని కలవడం ఇపుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.