తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. కారాణం ఏమిటంటే.. ఇవాళ పువ్వాడ అజయ్ కుమార్ కొడుకు నయన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. ఎన్టీఆర్‌ను కలిశారు. నయన్ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కావడంతో.. పుట్టిన రోజు వేళ తారక్ ను కలవాలని కోరాడట. దీంతో.. ఎన్టీఆర్ అపాయింట్ మెంట్ తీసుకోవడం.. వెళ్లి కలిసిరావడం జరిగిపోయింది. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ కూడా అక్కడే ఉన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జూనియర్ ఎన్టీఆర్ ను శాలువాతో సత్కరించారు. నయన్ పుట్టిన రోజు సందర్భంగా.. జూనియర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ విషయాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్ ద్వారా షేర్ చేసిన మంత్రి.. ఎన్టీఆర్‌ను కలిసినట్టు చెప్పారు. ”నా తనయుడు పువ్వాడ నయన్ పుట్టిన రోజు సందర్భంగా తారక్ గారిని మర్యాదపూర్వకంగా కలవడమైంది” అని పోస్టు చేశారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతుంది. ఆ తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో తన 30వ చిత్రం చేయబోతున్నాడు.