HomeTelugu Trendingసాయిపల్లవికి తెలంగాణ గవర్నర్ మద్దతు

సాయిపల్లవికి తెలంగాణ గవర్నర్ మద్దతు

Saipallavi

నాని, సాయిపల్లవి జంటగా నటించిన “శ్యామ్ సింగరాయ్” చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలై మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సాయి పల్లవి దేవదాసి యువతి పాత్ర చేసింది. కెరీర్‌లో తొలిసారి అలాంటి సున్నిత పాత్ర చేసిన సాయిపల్లవిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఈ చిత్రంలోని పాత్రకు సాయిపల్లవి సరిపోలేదని తమిళనాడు మీడియా వార్తలు రాసింది. ఆ వార్తలను చాలామంది ప్రేక్షకులు ఖండించారు.

సాయిపల్లవిని బాడీ షేమింగ్ చేయడంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై మండిపడ్డారు. గతంలో నా రూపాన్ని కూడా ట్రోల్ చేసేవారు. ఆ బాధ ఏమిటో పడ్డ నాకు తెలుసు అంటూ గుర్తుచేసుకున్నారు. ఓ తమిళ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ
విషయాన్ని వెల్లడించారు. నా ప్రతిభ, నా శ్రమతో ఆ మాటలను ఎదుర్కొన్నా అన్నారు. స్త్రీలు ఎక్కువగా బాడీ షేమింగ్‌కు గురవుతారు కానీ పురుషులు అలాంటి మాటలను ఎదుర్కోలేరని అన్నారు. మహిళలను బాధపెట్టడం ద్వారా వారి ఎదుగుదలకు ఈ సమాజం అడ్డుపడుతోందని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu