హైదరాబాద్ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 592 కేసులు నమోదయ్యాయి. ఇందులో సగం కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. దీంతో ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌పై దృష్టి పెట్టింది. హైదరాబాద్ పాతబస్తీలో లోకల్ ట్రాన్స్ మిషన్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతున్నది. రెండు మూడు హాస్పిటల్స్ లో చికిత్స పొందింది. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ పరీక్షలు నిర్వహించగా ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మహిళకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు. కరోనా పాజిటివ్ వ్యక్తులతో ఎలాంటి కాంటాక్ట్ కూడా లేదు. దీంతో మహిళకు లోకల్ ట్రాన్స్ మిషన్ ద్వారా కరోనా సోకినట్టుగా అనుమానిస్తున్నారు. ఇండియాలో లోకల్ ట్రాన్స్ మిషన్ ద్వారా కరోనా వ్యాపించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే ప్రకటించింది. మరి ఈ కేసును ఎలా చూస్తారో, ఏమని పిలుస్తారో చూడాలి.