తెలంగాణలో కరోనా కేసులు తగ్గినట్టు అనిపిస్తున్న తరుణంలో మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్నందున నిబంధనల సడలింపులపై ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎక్కడైతే కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తోంది. తెలంగాణలో గత 24 గంటల్లో 55 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1509 కి చేరింది. 34 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన 55 కేసుల్లో 44 కేసులు హైదరాబాద్ పరిధిలోనివే. వలస కార్మికులు 8, సంగారెడ్డిలో 2, రంగారెడ్డిలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 971 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో
504 మంది చికిత్స పొందుతున్నారు. ఇవాళ 12 మంది కరోనా బాధితులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.