తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1551కి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 42 పాజిటివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 37 కేసులు హైదరాబాద్ పరిధిలోనివే. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనాబారిన పడి 34 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 992 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 552 మంది ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇవాళ కరోనా నుంచి కోలుకుని 21 మంది డిశ్చార్జి అయ్యారు. తెలంగాణలోని వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కానట్టు అధికారులు తెలిపారు. గత 14 రోజుల్లో 25 జిల్లాల్లో కరోనా కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాలేదని వెల్లడించింది.