తెలంగాణలో ఇవాళ(19-5-20) కూడా కరోనా బాధితుల సంఖ్య భారీగానే పెరిగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇవాళ నలుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1634కి చేరింది. మరోవైపు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి ఇప్పటి వరకు 1011 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 585 మంది చికిత్సపొందుతున్నారు. ఇవాళ 9 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ నమోదైన 42 పాజిటివ్ కేసుల్లో హైదరాబాద్ పరిధిలోనే 34 కేసులు నమోదు అయ్యాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన 8 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.