తెలుగు బిగ్‌బాస్ ఫేమ్ తేజస్వి గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ఆమె తాజాగా నటించిన చిత్రం ‘కమిట్‌మెంట్’. డైరెక్టర్ లక్ష్మికాంత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినీ పరిశ్రమలో తారలపై లైంగిక వేధింపులతోపాటు పలు రంగాల్లో చోటుచేసుకొంటున్న వేధింపులను కథాంశంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం గురించి తేజస్విని మీడియాతో మాట్లాడుతూ.. బాలీవుడ్ తారలు దేనికైనా ఒప్పుకొంటారనే ఏకైక కారణంతో వారిని తమ సినిమాల్లో పెట్టుకొంటున్నారు. కమిట్‌మెంట్‌కు ఒప్పుకునే వాళ్లపైనే ప్రధానంగా దృష్టి పెడతారు. బాలీవుడ్ నుంచి వచ్చే వారందరూ అలా ఉంటారని కాదు.. కేవలం 20 శాతం మంది వల్లే ఇలాంటి చెడ్డపేరు తెలుగు హీరోయిన్లకు వస్తోందని తేజస్వి ఆవేదన వ్యక్తం చేసింది.
టాలీవుడ్‌లో చాలామంది నన్ను పడక గదిలోకి వస్తావా? అని అడిగారు. దానికి కమిట్‌మెంట్ పేరు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అందువల్లనే వాటిని ఒప్పుకోలేక నేను సినిమాలకు దూరంగా ఉంటున్నాను. సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్లు ముందుగానే కమిట్‌మెంట్‌కు ప్రిపేర్ అయి వస్తున్నారు. ఆ కేటగిరీలో మనం ఉంటే ముందుకు సాగుతాం. లేకపోతే నాలాగా ప్రతిభ ఉన్నా రేసులో వెనుకబడి పోతాం అని తేజస్వి మదివాడ అంటోంది.
గతంలో నాకు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించే ఓ వెబ్ సిరీస్‌లో న్యూడ్‌గా నటించాలని కండిషన్ పెట్టారు. ఆ సమయంలో నేను న్యూడ్ సీన్లు చేయడానికి ఒప్పుకోనని చెప్పాను. దాంతో ఆ ఆఫర్ మిస్సయింది. అలాంటి ఆఫర్లు వచ్చినా కమిట్‌మెంట్, అశ్లీల పాత్రలు చేయలేక మిస్ చేసుకొన్నానని చెప్పింది. ఒక సినిమాలో ముద్దు సీన్ ఉందనే కారణంగా ఆ సినిమాను వదులుకొన్నాను అంది. ఆ తర్వాత సీనియర్ హీరోయిన్లను చూసి అన్ని రకాల పాత్రలు చేయాలని రియలైజ్ అయ్యానని చెప్తోంది. ఇప్పుడు నటిగా, వ్యక్తిగా పరిణతి చెందాను. కమిట్‌మెంట్ చిత్రంలో నేను నటిగా ఎక్కువ మెచ్యూరిటీతో కనిపిస్తాను అంటోంది. ఇప్పుడు ఒకవేళ న్యూడ్ సీన్లు చేయాల్సిన పరిస్థితి వచ్చినా తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తా.. మంచి నటిగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తా అంటోంది తేజస్వి మదివాడ.