HomeTelugu Trendingరానాతో మరోసారి తేజ సినిమా!

రానాతో మరోసారి తేజ సినిమా!

8 22
రానా హీరోగా గతంలో వచ్చిన ‘నేనేరాజు నేనేమంత్రి’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రానా కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది. చాలా కాలం తరువాత తేజ ఖాతాలో ఒక విజయాన్ని జమ చేసింది. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టు ఫిల్మ్ నగర్లో ఒక టాక్ బలంగా వినిపిస్తోంది.

రానా ప్రధాన పాత్రధారిగా తేజ ఒక విభిన్నమైన కథను సిద్థం చేసుకున్నాడట. ఈ సినిమాలో రానా పాత్రను చాలా విలక్షణంగా డిజైన్ చేశాడని అంటున్నారు. ఈ సినిమా కోసం ఆయన ‘రాక్షస రాజ్యంలో రావణాసురుడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నాడట. దాదాపు ఇదే టైటిల్ ఖరారు కావొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం రానా .. ‘విరాటపర్వం’ సినిమాను పూర్తిచేసే పనిలో వున్నాడు. ఆ తరువాత ఆయన ‘హిరణ్యకశిప’ చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి తేజ సినిమా ఎప్పుడు చేస్తాడనే విషయంలో క్లారిటీ రావలసి వుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu