
Mirai OTT price:
సినిమా థియేట్రికల్ రైట్స్ ఎంత ముఖ్యమో, ఓటీటీ రైట్స్ కూడా అంతే ప్రాముఖ్యత అందుకుంటున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో యావరేజ్ టాక్ వచ్చినా, ఓటీటీలో విడుదలైన తర్వాత ప్రేక్షకుల ఆదరణ పెరిగిపోతుంది. అందుకే చాలా ఓటీటీ సంస్థలు ముందుగానే కొన్ని సినిమాలను భారీ ధరలకు కొనుగోలు చేస్తుంటాయి.
తాజాగా తేజ సజ్జా నటిస్తున్న Mirai కూడా అదే కోవలో చేరింది. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ ముందుకు వచ్చిందని సమాచారం. మొదట్లో రూ.23 కోట్లు ఆఫర్ చేసినా, మేకర్స్ ఎక్కువ డిమాండ్ చేయడంతో రూ.28 కోట్ల దాకా చర్చలు సాగాయని తెలుస్తోంది. కానీ ‘మిరాయ్’ టీమ్ మాత్రం రూ.30 కోట్లకు ఓటీటీ డీల్ లాక్ చేయాలని చూస్తోంది.
తేజ సజ్జా గతంలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ‘ఓ బేబి’లో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత హీరోగా మంచి సినిమాలు చేస్తూ, ‘హనుమాన్’తో తన రేంజ్ ను పెంచుకున్నాడు. ‘హనుమాన్’ హిట్ తర్వాత, ‘మిరాయ్’ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాకు విడుదలైన గ్లింప్స్ చూసిన తర్వాత, ఇది ఓ వైపు సైన్స్ ఫిక్షన్, మరో వైపు యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుందని అర్థమైంది.
ఇప్పటికే ‘మిరాయ్’ ఓటీటీ డీల్ విషయమై ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. ‘హనుమాన్’ విజయంతో తేజ సజ్జాకు ఓటీటీ మార్కెట్‌లో మంచి క్రేజ్ వచ్చిందని, అందుకే ‘మిరాయ్’ హక్కుల కోసం భారీ డిమాండ్ ఉందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. త్వరలోనే ఈ డీల్ ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.