HomeTelugu Big Storiesఅజిత్ 'తెగింపు' ట్రైలర్‌

అజిత్ ‘తెగింపు’ ట్రైలర్‌

Tegimpu Trailer
ప్రముఖ నటుడు అజిత్ హీరోగా తమిళంలో ‘తునీవు’ సినిమా రూపొందింది. బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాకి హెచ్. వినోత్ దర్శకత్వం వహించాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమాలో మంజూ వారియర్ హీరోయిన్‌గా నటించింది. తమిళనాట ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు.

తెలుగులో ఈ సినిమాను ‘తెగింపు’ పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే దిగనుంది. తాజాగా తెలుగు వెర్షన్ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపైనే ఈ ట్రైలర్ ను కట్ చేశారు. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో అజిత్ పాత్రను డిజైన్ చేసినట్టుగా ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. సముద్రఖని .. అజయ్ ఇద్దరూ కూడా పోలీస్ ఆఫీసర్స్ గా కనిపించారు. మంజు వారియర్ కూడా యాక్షన్ ఎపిసోడ్స్ లో పాల్గొందనే విషయం ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu