టీడీపీ నేత, మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 7.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని తన నివాసంలో ఉండగా అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అచ్చెన్నాయుడితో పాటు మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. 5 నిమిషాల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేసిన ఏసీబీ ప్రత్యేక బృందాలు అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకుంటున్న సమయంలో గన్‌మెన్‌ను కూడా అనుమతించలేదు. అచ్చెన్నాయుడిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు సమాచారం. టీడీపీ ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. ఈఎస్ఐ ఆసుపత్రులకు సంబంధించి మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ దర్యాప్తునకు ఆదేశించింది.