
TDP Minister Private Jet:
తెలుగుదేశం పార్టీ (TDP) ప్రభుత్వం ఆర్థిక సమస్యలపై పదేపదే మాట్లాడుతుంటే, మంత్రులు మాత్రం బాగా సంపాదిస్తున్నారా? తాజాగా ఓ మంత్రి అక్షరాల ₹150 కోట్లు విలువైన ప్రైవేట్ జెట్ కొనుగోలు చేశారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ జెట్ నేరుగా మంత్రిపేరుతో కొనుగోలు చేయలేదని, ఆయన నమ్మిన వ్యక్తి (బెనామీ) పేరుతో రిజిస్టర్ చేశారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి ఉపయోగించే అధికారిక విమానం లాంటి ఫీచర్లతో కూడిన ఈ జెట్ 14 మంది కూర్చునే సామర్థ్యం కలిగి ఉంది.
ఈ లావాదేవీకి వెనుక ఉన్న అసలు సూత్రధారి ఓ పవర్ బ్రోకర్ అని సమాచారం. కొన్ని ఏళ్ల కిందట ఆర్థికంగా దివాళా తీయడానికి వచ్చిన ఈ వ్యక్తి ఇప్పుడు భారీగా డబ్బు సంపాదించాడట. రెండు ప్రధాన రాజకీయ పార్టీలు అక్రమ ఆదాయాన్ని ఈ బ్రోకర్ ద్వారా పలు రంగాల్లో పెట్టుబడి పెట్టిస్తున్నాయని తెలుస్తోంది.
ఓ IAS అధికారి అయితే, “మంత్రివర్యులు తొమ్మిది నెలల్లో ఒక జెట్ కొన్నారంటే.. ఇంకో కొన్నేళ్లలో నాలుగు, ఐదు కొనేస్తారేమో!” అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ప్రభుత్వం రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని చెబుతుంటే, ఇలా కోట్ల విలువైన లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి? చంద్రబాబు దీనిపై స్పందిస్తారా అనేది చూడాలి.