HomeTelugu Big Storiesతెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో

తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో

6 5తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు మేనిఫెస్టోలోని ముఖ్యంశాలను శనివారం ప్రకటించారు. తొలుత దుర్గమ్మను దర్శించుకుని మేనిఫెస్టోకు పూజలు చేయించిన సీఎం.. ఉండవల్లిలోని ప్రజావేదికలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘మీ భవిష్యత్తు.. నా బాధ్యత’ అని మేనిఫెస్టోకు నామకరణం చేశారు. ప్రధానంగా రైతులు, సామాన్యులు, యువత, మహిళలకు ఈ మేనిఫెస్టోలో పెద్దపీట వేశారు.

మేనిఫెస్టోలో ముఖ్యాంశాలివే..

* రైతులు, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ వర్తింపు
* వృద్ధాప్య పింఛన్‌దారుల అర్హత వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గింపు
* డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కొనసాగింపు
* ఉచితంగా ఉన్నత విద్య
* ప్రభుత్వ పరిధిలో ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయడం, అలాగే ప్రైవేటు రంగంలో ఉద్యోగ కల్పన
* ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5లక్షలకు పెంపు
* చంద్రన్నబీమా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు
* పెళ్లి కానుక రూ.లక్షకు పెంపు
* అందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వడం
* ప్రతి ఎకరాకు నీళ్లందిస్తాం
* రైతులందరికీ ఉచితంగా పంటల బీమా పథకం
* రైతులకు పగటిపూట 12 గంటల పాటు ఉచిత విద్యుత్‌ సరఫరా
* రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరల కోసం ధరల స్థిరీకరణ నిధి.
* రైతులకు లాభసాటి ధరలు లభించేలా వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థల బలోపేతం
* ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రజలకు అవసరమైన తాజా కూరగాయలు, పండ్లు సరఫరాకు ప్రత్యేక చర్యలు
* రైతు ఉత్పత్తులకు నాణ్యమైన ధరలు లభించేలా చర్యలు
* గిరిజన రైతులకు ఐటీడీఏ ద్వారా ఉచితంగా విత్తనాలు, పెట్టుబడి రాయితీలు
* 40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉద్యాన పంటలను కోటి ఎకరాలకు విస్తరింపు
* మరో 50 లక్షల ఎకరాల్లో డ్రిప్‌, స్పింక్లర్‌ వ్యవస్థల ఏర్పాటు
* కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు
* యువతకు ఏటా ఉద్యోగాల భర్తీ చేస్తాం.
* నిరుద్యోగ భృతిని రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంచుతాం. ఇంటర్‌ పాసైతే చాలు నిరుద్యోగ భృతి ఇస్తాం.
* ఇంటర్‌ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తాం.
* రైతులకు లాభసాటి ధరలు లభించేలా వ్యవసాయ మార్కెట్‌ వ్యవస్థల బలోపేతం
* ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రజలకు అవసరమైన తాజా కూరగాయలు, పండ్ల సరఫరాకు ప్రత్యేక చర్యలు.
* కేంద్రంతో పోరాడి వ్యవసాయంతో నరేగా అనుసంధానం
* ఆదివాసుల కోసం ప్రత్యేక బ్యాంక్‌ తీసుకొస్తాం.
* బీసీల్లో చేపల వేటకు వెళ్లే వారిలో క్రాప్‌ హాలిడే కింద రూ.10 వేలకు పెంపు. డీజిల్‌ ప్రోత్సాహకం రూ.10కి పెంపు.
*20 వేల జనాభా దాటిన మేజర్‌ పంచాయతీలన్నింటిలో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు
*పేద కుటుంబాలకు పండుగల నాడు ఉచితంగా రెండు గ్యాస్‌ సిలిండర్లు
* ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ పదేళ్లు కొనసాగింపు. రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు. కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరికీ విదేశీ విద్య కోసం రూ.25 లక్షల ఆర్థిక సాయం.
* ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ చేస్తాం.
* మాదిగ, రెల్లిలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు
* రూ.10 వేల కోట్లతో బీసీల కోసం ప్రత్యేక బ్యాంకు. బీసీ సబ్‌ ప్లాన్‌కు చట్టబద్ధత
* ఏపీఐఐసీ ప్లాట్లలో 25 శాతం బీసీలకు రిజర్వేషన్‌
* స్వయం ఉపాధిలో భాగంగా ఇన్నోవా వంటి కార్ల కొనుగోలుకు 25 శాతం రాయితీ.
* ప్రతి కుటుంబానికి రూ.20వేలు ఆదాయం కల్పించేలా చర్యలు
* డ్వాక్రా మహిళలకు పసుపు – కుంకుమ పథకం కొనసాగింపు, ఉచితంగా స్మార్ట్‌ ఫోన్లు
* మహిళా ఉద్యోగినులకు ద్విచక్రవాహనాల కొనుగోలుకు రాయితీలు
* చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు సాధించేందుకు కృషి
* ఏపీని పోషకాహార లోపం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
* రాష్ట్రంలో 15,358 అంగన్వాడీకేంద్రాలకు సొంత భవనాలు నిర్మాణం. ప్రీ స్కూళ్లలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభం
* గిరిజన ప్రాంతాల్లో గర్భిణులకు హోమ్‌ ఫర్‌ ప్రేగ్నస్ట్‌ ఉమెన్‌ ఏర్పాటు
* వర్గీకరణలో పెండింగ్‌లో ఉన్న కులాలకు న్యాయం జరిగేలా చూస్తాం.
* రాజకీయ ప్రాతినిథ్యం లేని వడ్డెర, బ్రాహ్మణ కులాలకు ఎమ్మెల్సీ ఇస్తాం.
* చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా ఉచితం. మార్కెటింగ్‌ నిధి రూ.250 కోట్లు ప్రకటిస్తాం.
* రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఏర్పాటు. సెంటర్‌ఆఫ్‌ ఎక్సలెన్స్‌ మంగళగిరిలో ఏర్పాటు చేసి శిక్షణ కల్పిస్తాం.
* కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ ఇచ్చాం. విదేశీ విద్యకు రూ.25 లక్షలు ఇస్తాం. అన్ని విధాలా కాపుల్లోని పేదలను ఆదుకొనేందుకు అండగా ఉంటాం.
* అన్ని అగ్ర కులాల్లోని పేదలకు న్యాయం చేస్తాం.
* ఇస్లామిక్ బ్యాంకుకు ఏర్పాటుకు శ్రీకారం. దీని ద్వారా వడ్డీలేని రుణాలు.
* క్రిస్టియన్లకు ప్రతి జిల్లాలో క్రైస్తవ భవనం. శ్మశానాలకు స్థలాలు కేటాయించడం. పాస్టర్లకు, ఇమామ్‌, పూజారులకు ఉచితంగా ఇళ్లు.
* దివ్యాంగులకు మూడు చక్రాల మోటారు వాహనం. దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం రూ.50 వేల కోట్ల మూల ధనం.
* మానసిక వికలాంగులకు రూ.3 వేల పింఛను
* రూ.10 లక్షలలోపు పెట్టుబడి ఉంటే వడ్డీ లేని రుణాలు.
* రూ.100 కోట్లతో ఇన్నోవేటివ్‌ ఫండ్‌
* రాజమహేంద్రవరం, ఏలూరు, తిరుపతిని ఇన్నోవేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం.
* గ్రామాల్లో 2 వేల జనాభా ఉంటే భూగర్భ డ్రైనేజీ, సిమెంటు రోడ్లు, ప్రతి ఇంటికీ 70 లీటర్ల తాగునీరు.
* మెగా టెక్స్‌టైల్‌ ప్లాంట్లలో 3 లక్షల ఉద్యోగాలు.
* తిరుపతిలో ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌ పెద్ద ఎత్తున తీసుకొస్తాం.
* విశాఖపట్నంలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌.
* 100 శాతం అక్షరాస్యత సాధన దిశగా కృషి
* ఆరోగ్య పర్యాటకాన్ని (హెల్త్‌ టూరిజం) అభివృద్ధి చేస్తాం.
* ప్రభుత్వ ఉద్యోగులంతా మా ప్రభుత్వంతో సంతోషంగా ఉన్నారు. నాలుగో తరగతి ఉద్యోగులు, ఇతరుల పదవీ విరమణ వయసు పెంచాం. ఉద్యోగుల సంక్షేమంలో మనం
దేశంలో తొలిస్థానంలో ఉన్నాం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu