పోలరవం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ నాణ్యతను పరీక్షించేందుకు కూడా ప్రభుత్వం చెల్లింపుచేసింది. అయితే నిబంధన ప్రకారం అక్కడ నాణ్యత పరీక్షకులేబరేటరీ ఏర్పాటు చేయాల్సి ఉన్న టిడిపి నేతల కక్కుర్తికనీసం లేబరేటరీని కూడా ఏర్పాటు చేయనీయలేదు.లేబరేటరీ ఉన్నట్లు సంస్థ మాత్రం తెలిపింది. సిమెంట్, ఇతర మెటీరియల్ కాంట్రాక్టు సంస్థ కొనుగోలు చేసి బిల్లులనుశాఖా పరంగా చెల్లించారు. ఈ చెల్లింపు కాంట్రాక్టర్ నుంచితరువాత రాబట్టినా ఇది ప్రభుత్వ విధానం, ఒప్పందనిబంధనకు పూర్తిగా వ్యతిరేకం. శాఖా పరమైన చెల్లింపుద్వారా కాంట్రాక్టు ఏజెన్సీ మెటీరియల్ కొనుగోలు చేసినా .. 7 ఏఫ్ అకౌంట్ నిర్వహణ ద్వారా కొనుగోలు చేసినామెటీరియల్ నిర్మాణ ప్రాంతానికి చేరుతుందా లేదా అనే పర్యవేక్షణ అవసరం . అయతే చెల్లించిన అడ్వాన్సుకుసరిపడినంత మెటీరియల్ వచ్చిందా లేదా అనే పర్యవేక్షణకూడా అస్సలు జరగలేదు. డిపార్ట్‌మెంటల్ స్టోర్ అక్కడలేదు. నిబంధన ప్రకారం డివిజినల్ ఎకౌంట్స్ అధికారి అన్నిఅకౌంట్లను తనిఖీ చేయాలి. ఇది జరగలేదు. ఇంప్రెస్ట్ అకౌంట్ కింద చేసిన ఖర్చు ఆడిట్ జరగలేదు. సమగ్రఅకౌంట్స్ వివరాలు అందుబాటులో లేవు. ఓచర్లపైమెటీరియల్ పూర్తి వివరాలు, ఒక్కో మెటీరియల్ ధర లేవు. ఏకమొత్తంగా చెల్లింపులు జరిగాయి. అకౌంట్స్ కోడ్ అమలౌందా లేదా అని డీఏఓ పర్యవేక్షించాలి. అలాంటివ్యవస్థ ఎస్‌ఈ వద్ద అందుబాటులో లేదు కోడ్ రూల్‌నుఇక్కడ ఉల్లంఘించారు.వారానికి ఒకసారి రేషన్ కింద 2017 సెప్టెంబర్ 25తో పాటు పులుమార్లు చెల్లింపులు జరిపారు. ఎస్‌ఈని కాంట్రాక్టర్ ఏర్పాటు చేసిన కిచెన్ ఇన్‌ఛార్జిగాచూపారు. ఇదో వింత. ఆ రోజున 44,23,981 అడ్వాన్స్‌గాచెల్లించారు. ఎంత దారుణంగా అందినకాడికి దోచుకున్నారోఅనేదానికి ఇదో ఉదాహరణ. వీక్లీ రేషన్‌కు భారీమొత్తంలో అడ్వాన్స్‌లు చెల్లించారు. మెటీరియల్‌కు అడ్వాన్స్ చెల్లించారు.కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేసిన మొత్తాన్నిఇంప్రెస్ట్ హ్డోల్డర్ ఎకౌంట్‌లో జమ చేశారు. ప్రభుత్వ ఎకౌంట్‌లోజమ కాలేదు. డీజిల్ కొనుగోలు చేసేందుకు కొత్త కాంట్రాక్టర్‌కురివాల్వింగ్ ఫండ్ కింద ప్రత్యేకంగా చెల్లించారు. పాతకాంట్రాక్టర్‌కు ఎన్‌ఎంఆర్ చెల్లింపు కింద రూ. 12.28లక్షలుజమ చేశారు. ఇంప్రెస్ట్, రివాల్వింగ్ ఫండ్ కింద చేసినచెల్లింపు ఎం బుక్‌లో నమోదు చేయలేదు. ఇది నిబంధనకువిరుద్ధం. ఇంప్రెస్ట్, రివాల్వింగ్ ఫండ్ కింద అందుకున్నమెటీరియల్‌కు సంబంధించిన శాఖా అకౌంట్లలో ఎలాంటివివరాలు లేవు. ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్‌స్ట్రాయ్ నుంచిఇంప్రెస్ట్ అకౌంట్ ద్వారా రూ. 144.22 కోట్లు బకాయి ఉన్నారు.ఆ మొత్తాన్ని రికవరీ చేసేందుకు ఎలాంటి చర్యలుతీసుకోలేదు. ఈ మొత్తాన్ని రికవరీ చేసేందుకు న్యాయపరంగాజలవనరుల శాఖ చర్యలు తీసుకోవాలి. ఆర్ ఆర్ చట్టంద్వారా రికవరీ చేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు చేసినపోలవరం దందాలో నిబంధనలను పాతరేసి దోపిడికి పాల్పడ్డ తీరుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అసలు పోలవరంలో జరిగిన అవినీతిపై నిపుణుల కమిటి ఏమన్నదో కొన్ని వివరాలను చూద్దాం.
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందాన్నిపున:సమీక్షించటం వ్ల 2015`16 ఎస్ ఎస్ ఆర్ రేట్లప్రకారం 1331 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపైపడింది.
• వాస్తవ ప్రధాన కాంట్రాక్టర్ నుంచి మొబిలైజేషన్ అడ్వాన్స్‌పై వడ్డీ 84.43 కోట్లు తిరిగి రాబట్టాలి.
• ఇంప్రెస్ట్ కింద ప్రధాన కాంట్రాక్టర్‌కు చెల్లించిన 141.22 కోట్ల మొత్తాన్ని ప్రధాన కాంట్రాక్టర్ నుంచి రికవరీచేయాలి.
• స్థలం స్వాధీనం చేయకముందే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టునిర్మాణానికి చెల్లించిన అడ్వాన్సు 787.20 కోట్లు తిరిగిరాబట్టాలి.
• 5.ఈవిధంగా చూస్తే మొత్తం అదనపు చెల్లింపులు2346.85 కోట్లు.
• ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టునుసత్వరమే పూర్తి చేయాలి. ప్రాజెక్టుతో పాటు పవర్‌హౌస్ నిర్మాణ పను కొనసాగింపు తప్పనిసరి. నిర్మాణపనులను ప్రస్తుతం చేస్తున్న సంస్థతోనే కొనసాగించాలా, కొత్త సంస్థతో చేయించాలా అనే అంశాన్ని ప్రభుత్వంన్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకునినిర్ణయించాలి. నిర్వహణలోపాలు, నిర్మాణంలో జాప్యంవంటి వాటిని పరిష్కరించేందుకు సంబంధిత ప్రాజెక్టుఅధికారి దృష్టి సారించాలి.
• ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకున్న వాస్తవ సంస్థట్రాన్స్‌స్ట్రాయ్ ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఎన్‌సీఎల్‌టీ కేసుల్లో ఇరుక్కున్నందున దానినికొనసాగించాలా లేదా తొగించాలా అనే అంశంపైసత్వరమే నిర్ణయం తీసుకోవాలి.
• 8.పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి వివిధ సందర్భాల్లో తొలుత కాంట్రాక్టు పొందినట్రాన్స్‌స్ట్రాయ్ సంయుక్త భాగస్వామ్య సంస్థల వైఫల్యంచెందటంతో ఏపీఎస్‌ఎస్‌లోని పీఎస్ 60సీ నిబంధనకింద ఆ సంస్థను తొలగించి పనులను మెస్సర్స్ నవయుగ ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించారు.
• 9.పోలవరం హెడ్‌వర్క్స్, విద్యుత్ కేంద్రానికిసంబంధించిన పత్రాలను కమిటీ సభ్యులు పరిశీలించికింది అభిప్రాయానికి వచ్చారు.
• 10.ప్రధాన డ్యాం పనులను ఈపీసీ నిబంధనకుఅనుగుణంగా ధర పెంపునకు అవకాశం ఉండగాఅందుకు విరుద్ధంగా ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్‌స్ట్రాయ్ జేవీ సంస్థకు 2015`16 ఎస్‌ఎస్‌ఆర్ రేట్లను చెల్లించారు. ఈ రేట్లతో ఒప్పందాన్ని రివైజ్ చేయటంతో పాటు ఒప్పంద విలువను రూ. 4054 నుంచి ఎకంగా 5385.91కు పెంచారు.
• 11.ఆ ఒప్పందం ప్రకారం స్టీల్, సిమెంట్, ఇంధనంకుమాత్రమే ధరను సవరించే అవకాశం ఉంది. నిబంధలను అతిక్రమించటం వల్ల ఒప్పంద విలువరూ. 1331 కోట్లకు పెరిగింది. ఇది నిబంధనలకుపూర్తిగా విరుద్ధం. మిగిలిన సివిల్ పనులను 2018`19 సంవత్సరంలో ట్రాన్స్‌స్ట్రాయ్ జేవీ నుంచి తొలగించినవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి అప్పగించారు. ఈపనుల విలువ రూ. 3302 కోట్లు.
• 12.ఈపీసీ కాంట్రాక్టర్‌కు అడ్వాన్స్ రూపంలో ప్రత్యేకంగాచెల్లించిన రూ. 144.22 కోట్లను తిరిగి వసూలు చేయలేదు. ఈ మొత్తాన్ని రాబట్టేందుకు తగిన చర్యుతీసుకోవాలి.
• 13. మొబిలైజేషన్ అడ్వాన్స్ కింది చెల్లించిన మొత్తానికిరూ. 84.43 కోట్ల బకాయిల వడ్డీని వసూలుచేయలేదు. అడ్వాన్స్, మొబిలైజేషన్ అడ్వాన్స్‌పై వడ్డీమొత్తం కలుపుకుని అదనపు చెల్లింపులు రూ. 228.65 కోట్లు ప్రధాన కాంట్రాక్టర్ నుంచి రికవరీచేయాలి.