Homeపొలిటికల్Chandrababu Naidu: వాలంటీర్ల జీవితాలు మారుస్తాం

Chandrababu Naidu: వాలంటీర్ల జీవితాలు మారుస్తాం

TDP chief Chandrababu offer to volunteer
Chandrababu’s offer to volunteers: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో నేడు రెండో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. యువత కోసం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని మండిపడ్డారు. యువతకు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఏటా జాబ్‌ కేలండర్‌ అంటూ నిలువునా ముంచారని మండిపడ్డారు. ఐదేళ్లుగా ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా.. ఎన్నికల ముందు హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాలెడ్జ్‌ ఎకానమీలో తెలుగు యువత అగ్రస్థానంలో ఉండాలనేదే తన కోరిక అని అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా యువతతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో గ్రూప్‌-1 పోస్టులను ఇష్టారీతిన కావాల్సిన వారికి ఇచ్చారని ఆరోపించారు.

”వైసీపీ నాయకులు సర్వే నంబర్లు మార్చి సామాన్యుల నుంచి భూములు లాక్కుంటున్నారు. కుప్పంలోనే నన్ను బెదిరిస్తున్నారు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ఖనిజ సంపద దోచేస్తున్నారు. మద్యం, గంజాయి విక్రయించి డబ్బు సంపాదిస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జే బ్రాండ్ మద్యాన్ని అరికడతాం. యువతలో సామాజిక స్పృహ, సామాజిక భాద్యత ఉండాలి. రాష్ట్రాన్ని కాపాడాలనే మూడు పార్టీలు కలిసి మీ ముందుకు వచ్చాయి. జెండాలు మూడు.. అజెండా మాత్రం ఒక్కటే.

నేను ఐటీ ఉద్యోగాలు, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు కల్పిస్తే… ఈ ప్రభుత్వం మటన్ కొట్లు, ఫిష్ మార్ట్ ల్లో ఉద్యోగాలు అంటోందని చంద్రబాబు విమర్శించారు. యువతకు చేయడానికి చేతినిండా పనిలేనప్పుడే వారు వ్యసనాల బాట పడతారని, చేయడానికి పనేమీ లేకపోతే ఓ క్వార్టర్ వేసుకుందామని అనుకుంటున్నారని వివరించారు.

రాష్ట్రంలో పాలనను మళ్లీ గాడిన పెట్టే బాధ్యత నాది. ఐటీని ప్రోత్సహించి యువతకు కొత్త దారి చూపించా. టెక్నాలజీ దుర్మార్గుల చేతిలో పడితే ప్రమాదకరం. పారదర్శకంగా జరగాల్సిన టెండర్లలోనూ అవకతవకలకు పాల్పడుతున్నారు. భవిష్యత్తులో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ తీసుకొస్తాం. అన్ని మండల కేంద్రాల్లో వర్క్‌ స్టేషన్లు నిర్మిస్తాం. మేం వచ్చాక ప్రతి నియోజకవర్గానికి విజన్‌ తయారు చేస్తాం. వాలంటీర్లు నెలకు రూ.30వేల నుంచి రూ.50వేలు సంపాదించుకునేలా చేస్తాం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా వాలంటీర్ల జీవితాలు మారుస్తాం.” అని చంద్రబాబు ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu