యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్రలో నటించిన బాలీవుడ్ నటి దీపికా పదుకొనే చిత్రం ఛపాక్ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ముసుగు దుండగుల దాడిలో గాయపడిన విద్యార్థులను దీపికా పరామర్శించడం ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. ఆమె జేఎన్‌యూకి వెళ్లిన మరుక్షణం నుంచి సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఛపాక్‌ను బాయ్‌కాట్ చేయాలని పోస్ట్‌లు
పెడుతున్నారు. సినిమా ప్రచారం కోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.
ఛపాక్ సినిమాకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు అండగా నిలిచాయి. ఈ సినిమాకు పన్ను వసూలు నుంచి మినహాయింపు ఇచ్చాయి. ఈ మేరకు మొదట మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించగా.. వెంటనే ఛత్తీస్‌గఢ్ సర్కార్ కూడా సానుకూలంగా స్పందించింది. దీంతో ఆమె అభిమానులు రెండు రాష్ట్రాల సీఎంలకు అభినందనలు
తెలుపుతున్నారు.